మిస్టర్ ప్రెగ్నెంట్ డెలీవరికీ మైత్రీ మూవీస్.. షాకింగ్ బిజినెస్.. ఫ్యాన్సీ రేటుకు హక్కులు!
హిట్స్, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా సినిమా రంగంపై ప్యాషన్‌తో చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాత అప్పిరెడ్డి. మైక్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన స్లమ్ డాగ్ హస్బెండ్ చిత్రాన్ని ఇటీవల రిలీజ్ చేశారు. ఆ సినిమా రిలీజై కొన్ని వారాలు గడవక ముందే మరో సినిమాతో రెడీ అవుతున్నారు. ఇంకా రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే వారు నిర్మించిన జార్జిరెడ్డి, ప్రెజర్ కుక్కర్ సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. తాజాగా మైక్ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన మిస్టర్ ప్రెగ్నెంట్ బిజినెస్ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే..
అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్, విభిన్నమైన కథతో రూపొందిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా విశేషమైన పాపులారిటీని సొంతం చేసుకొన్న యువ హీరో సయ్యద్ సోహైల్ ర్యాన్, యువ హీరోయిన్ రూపా కొడవాయూర్ కలిసి నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. ఈ సినిమా భారీ అంచనాలు, క్రేజ్‌తో ఆగస్టు 18వ తేదీన విడుదలకు సిద్దమైంది. ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సొంతం చేసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఇటీవల మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను చూసి నచ్చిన మైత్రీ మూవీస్ నిర్మాతలు ఫ్యాన్సీ రేట్‌ను చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకొన్నట్టు సమాచారం. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాను మైత్రీ నైజాంలో రిలీజ్ చేస్తుండటంతో ఈ మూవీ గ్రాఫ్ మరింత పెరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా ఈ సినిమా రిలీజ్ కావడంతో యూనిట్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా విషయానికి వస్తే.. మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున చేతుల మీదుగా రిలీజైన మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నాయి. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా కోసం యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.
నటీనటులు: సొహైల్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష, స్వప్నిక, అభిషేక్ రెడ్డి బొబ్బల తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి
నిర్మాతలు: అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి
సినిమాటోగ్రఫి: నిజార్ షఫీ
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
ఆర్ట్: గాంధీ నడికుడికర్
బ్యానర్: మైక్ మూవీస్
పీఆర్వో: జీఎస్కే మీడియా
రిలీజ్ డేట్: 2023-08-18


Click it and Unblock the Notifications











