Adipurush: మైత్రీ చేతికి ఆదిపురుష్.. ఒక్క ఏరియాకే అన్ని కోట్లు పెట్టేశారా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. అప్పటి నుంచి ఏకధాటిగా భారీ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పటికే పలు సినిమాలను ప్రేక్షకులకు అందించిన అతడు.. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే మైథాలజీ మూవీతో రాబోతున్నాడు.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రూపకల్పనలో రామాయణం నేపథ్యంతో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తుంది.

Mythri Movie Makers to Release Adipurush in Nizam Area

అత్యంత భారీ బడ్జెట్‌తో టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'ఆదిపురుష్' సినిమాను జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌ను నిర్మాతలు పూర్తి చేసుకున్నారు.

ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని ఏరియాల రైట్స్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా రూ. 160 కోట్లు నిర్మాతలకు చెల్లించినట్లు స్వయంగా వాళ్లే వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నైజాం డీల్ రివీల్ అయింది.

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నైజాం ఏరియాలో విడుదల చేస్తుంది. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా వాళ్లే స్వయంగా ప్రకటించారు. అంటే.. వీళ్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి నైజాం ఏరియాకు సంబంధించిన హక్కులను కొనుగోలు చేసుకున్నారు.

ఇక, దీని కోసం దాదాపు రూ. 60 కోట్లు మేర చెల్లించినట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. అదే జరిగితే టాలీవుడ్ చరిత్రలో ఇది ఒక రికార్డుగా నిలుస్తుందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉండగా.. 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా హనుమంతుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి అజయ్ - అతుల్ సంగీతాన్ని సమకూర్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X