ఊహించిన స్థాయిలో లేవు: ‘నా పేరు సూర్య’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ యాక్షన్ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తి చేసుకుంది. టాలీవుడ్లో ఇటీవల విడుదలైన రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవడంతో..... బన్నీ మూవీ కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందనే ఒక హైప్ వచ్చింది. అయితే విడుదలైన తర్వాత ఆ హైప్ రీచ్ అవ్వడంలో 'నా పేరు సూర్య' విఫలమైంది.
Recommended Video


తొలి వారం ఎంత వసూలైంది
‘నా పేరు సూర్య' థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మారు. బాక్సాఫీసు వద్ద తొలివారం వరల్డ్ వైడ్ రూ. 44.5 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఇది ఊహించిన దానికంటే తక్కువే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. తొలివారం 60 నుండి 70శాతం రికవరీ అయితే బెస్ట్, అయితే ‘నా పేరు సూర్య' కేవలం 55 శాతం మాత్రమే రికవరీ చేసింది.

దారుణంగా పడిపోయిన కలెక్షన్లు
‘నా పేరు సూర్య' చిత్రం ఫస్ట్ వీకెండ్ మాత్రమే ఆశాజనకమైన వసూళ్లు సాధించింది. తొలి నాలుగు రోజులు పూర్తయిన తర్వాత ఐదవ రోజు నుండి కలెక్షన్లు క్రమక్రమంగా డ్రాప్ అవ్వడం మొదలైంది. 7వ రోజు ఓవరాల్ కేవలం 90 లక్షలు షేర్ మాత్రమే రావడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

ఏపీ-తెలంగాణలో పరిస్థితి ఏమిటి?
తొలి వారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 34.43 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో రూ. 11.10 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 5.80 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.51 కోట్లు, గుంటూరులో రూ. 3.66 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.47 కోట్లు, కృష్ణ రూ. 2.32 కోట్లు, నెల్లూరులో రూ. 1.37 కోట్లు రాబట్టింది.

రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలెక్షన్స్
రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు వెర్షన్ దాదాపు రూ. 10 కోట్లు రాబట్టింది. దీంతో ఓవరాల్ వరల్డ్ వైడ్ షేర్ రూ. 44.63 కోట్లు చేరుకుంది. డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే ఈ చిత్రం ఇంకా రూ. 36 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











