twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నా పేరు సూర్య’.... బాక్సాఫీస్ కలెక్షన్ల పరిస్థితి ఏమిటి?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Naa Peru Surya Movie Collections

    అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. అల్లు అర్జున్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. బన్నీ గత చిత్రం డిజె రికార్డులను ఈ మూవీ బద్దలు కొట్టింది. సినిమా విడుదల ముందు నుండే భారీ హైప్ ఉండటంతో అందుకు తగిన విధంగానే స్టైలిస్ స్టార్ కెరీర్లోనే రికార్డు స్థాయి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

    తొలి రోజు ఎంత వసూలు చేసింది?

    తొలి రోజు ఎంత వసూలు చేసింది?

    ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో అల్లు అర్జున్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా నిలిచింది. బన్నీ గత చిత్రం ‘డిజె-దువ్వాడ జగన్నాధం' తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లు వసూలు చేయగా... దాన్ని ‘నా పేరు సూర్య' మూవీ బద్దలు కొట్టింది.

     రూ. 75 కోట్లకు థియేట్రికల్ రైట్స్

    రూ. 75 కోట్లకు థియేట్రికల్ రైట్స్

    ‘నా పేరు సూర్య' ఫస్ట్ ఇంపాక్ట్ విడుదలైనప్పటి నుండే ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో థియేట్రికల్ రైట్స్ రూ. 75 కోట్లకు అమ్ముడు పోయాయి. ఆయా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేశారు. ఇది కూడా సినిమా భారీ ఓపెన్సింగ్ సాధించడానికి తోడ్పడింది.

     ఆ విషయంలో ఫెయిలైన నా పేరు సూర్య

    ఆ విషయంలో ఫెయిలైన నా పేరు సూర్య

    ఏపీ, తెలంగాణల్లో కొన్ని ఏరియాల్లో బన్నీ గత చిత్రం ‘డిజె' రికార్డులను బద్దలు కొట్టడంలో ‘నా పేరు సూర్య' ఫెయిలైంది. థియేటర్ల సంఖ్య తక్కువగా దొరకడమే ఇందుకు కారణమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

    పోటీ వాతావరణంలో విడుదలైన నా పేరు సూర్య

    పోటీ వాతావరణంలో విడుదలైన నా పేరు సూర్య

    ‘డిజే-దువ్వాడ జగన్నాధమ్' విడుదల సమయంలో పెద్ద సినిమాల పోటీ లేదు. అయితే తాజాగా ‘నా పేరు సూర్య' బ్లాక్ బస్టర్ హిట్స్ ‘రంగస్థలం', ‘భరత్ అనే నేను' చిత్రాలతో పోటీ పడుతూ విడుదలైంది. దీంతో పాటు హాలీవుడ్ హిట్ మూవీ ‘అవేంజర్స్: ఇన్పినిటీ' వార్ కూడా బరిలో ఉంది. ఈ కారణంగా మల్టీప్లెక్సుల్లో ‘నా పేరు సూర్య'కు లిమిటెడ్ స్క్రీన్లు మాత్రమే దొరికాయి.

    ఫస్డ్ డే షేర్ రూ. 20 కోట్లు

    ఫస్డ్ డే షేర్ రూ. 20 కోట్లు

    తొలిరోజు ‘నా పేరు సూర్య'కు డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 20 కోట్ల వచ్చినట్లు సమాచారం. ఓవరాల్‌ షేర్ రూ. 75 కోట్ల నుండి రూ. 80 కోట్ల మధ్య వసూలైతే ఈ చిత్రం లాభాల బాటలోకి వెళ్లనుంది. మరి ఎన్ని రోజుల్లో నా పేరు సూర్య ఈ మార్కును అందుకుంటుందో చూడాలి.

     యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్ పరిస్థితి ఇలా

    యూఎస్ఏ ప్రీమియర్ షో కలెక్షన్ పరిస్థితి ఇలా

    యూఎస్ఏ ప్రిమియర్ షోస్ ద్వారా కూడా ఈ చిత్రం ఆశించిన వసూళ్లు రాబట్టలేదు. అక్కడి ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం $ 207K వసూలు చేసినట్లు సమాచారం. బన్నీ గత చిత్రం ‘డిజె-దువ్వాడ జగన్నాధం' యూఎస్ఏ ప్రీమియర్ షోల ద్వారా $305K వసలూ చేసింది.

    English summary
    Vamsi Kaka tweeted, "With 40cr worldwide gross #NaaPeruSurya, #EntePeruSuryaEnteVeeduIndia #EnPeyarSuryaEnVeeduIndia Becomes biggest opening film #StylishStar alluarjun's career." However, Naa Peru Surya has failed to beat the opening record of Allu Arjun's DJ aka Duvvada Jagannadham in Andhra Pradesh and Telangana. The reason for this average performance is that the movie was released in a limited number of screens, due to lack of cinema halls in the state.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X