twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లోజింగ్ కలెక్షన్స్: నా పేరు సూర్య అలా ముగిసింది.. బయ్యర్లకు ఎంత మేరకు వాత పడిందంటే!

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్ర బాక్సాఫీస్ రన్ ముగిసింది. మే 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నా పేరు సూర్య తొలి రోజు ఉంచే డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. రచయితగా సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించితిన వక్కంతం వంశి తొలిసారి దర్శకుడిగా మారి చేసిన చిత్రం ఇది. హృదయం నిండా దేశభక్తి పెంచుకున్న యువకుడు ఆర్మీ అధికారిగా బోర్డర్ కు వెళ్లాలనే కలని సాకారం చేసుకునే కథ ఇది. బన్నీ నటనతో మెప్పించినా చిత్రం ఆకట్టుకోలేకపోయింది. అన్ని ఏరియాలలో బాక్సాఫీస్ రన్ ముగించుకున్న ఈ చిత్రం బయ్యర్లకు భారీ స్థాయిలోనే నష్టాలు మిగిల్చింది.

    అంచనాలు అందుకోలేక

    అంచనాలు అందుకోలేక

    ఆర్మీ అధికారిగా బన్నీ చేసే విన్యాసాలపై ఆడియన్ ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. కానీ దర్శకుడు ఈ చిత్రంలో అనేక అంశాలని టచ్ చేయడంతో ఎక్కడో కాంటాక్ట్ మిస్ అయింది. ఫలితంగా చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది.

     ఆంధ్రలో వసూళ్లు

    ఆంధ్రలో వసూళ్లు

    మొత్తంగా ఈ చిత్రం ఆంధ్ర ఏరియాలో 20 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో 5 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 2.85 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2.65 కోట్లు రాబట్టింది. గుంటూరులో 4 కోట్ల వరకు రాబట్టిన ఈ చిత్రం నెల్లూరులో కోటిన్నర వసూలు చేసింది. సీడెడ్ లో మరో 6 కోట్లు రాబట్టింది.

    నైజాంలో తీవ్ర నిరాశ

    నైజాంలో తీవ్ర నిరాశ

    బన్నీ చిత్రాలు సహజంగా నైజాంలో రాణిస్తాయి. కానీ నా పేరు సూర్య చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కేవలం 12 కోట్లవరకు మాత్రమే షేర్ నిలిచిపోయింది.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 53 కోట్ల షేర్ రాబట్టింది. ఇందులో తెలుగు రాష్ట్రాల షేర్ 39 కోట్లు కావడం విశేషం. యుఎస్ లో కేవలం 2 కోట్లు మాత్రమే రాబట్టింది. కర్ణాటకలో 6 కోట్లు వసూలు చేసింది.

    బయ్యర్లకు పెద్ద దెబ్బ

    బయ్యర్లకు పెద్ద దెబ్బ

    నా పేరు సూర్య చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 80 కోట్లకు పైగా జరిగింది. బయ్యర్లు 30 కోట్ల వరకు నష్టపోయారు. అల్లు అర్జున్ చిత్రాలలో ఇంత భారీ మార్జిన్ తో నష్టాలు రావడం ఇదే తొలిసారి.

    English summary
    Naa Peru Surya closing box office collections. Buyers gets loss with huge margin
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X