twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిమ్మతిరిగేలా నా పేరు సూర్య ప్రీరిలీజ్ బిజినెస్.. హిట్ కావాలంటే ఇంత వసూలు చేయాలట!

    By Rajababu
    |

    డిజే తర్వాత ఓ ఎమోషనల్ కంటెంట్‌తో అల్లు అర్జున్ తాజాగా మళ్లీ బరిలోకి దూకాడు. కథ, మాటల రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా భారీ అంచనాలు పెంచింది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 100 కోట్లకుపైగా బిజినెస్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

    100 కోట్లకుపైగా బిజినెస్

    100 కోట్లకుపైగా బిజినెస్

    నా పేరు సూర్యకు ముందు అల్లు అర్జున్ నటించిన డీజే చిత్రం వంద కోట్ల మార్కు దాటింది. వరుస విజయాలతో స్టైలిష్ స్టార్ దూసుకుపోతుండటంతో నా పేరు సూర్యపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ చిత్రం రూ.100 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను చేసింది.

     థియట్రికల్ రైట్స్ ఇలా

    థియట్రికల్ రైట్స్ ఇలా

    నా పేరు సూర్యకు సంబంధించి ప్రీరిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 103 కోట్లు చేసింది. వరల్డ్ వైడ్‌గా థియట్రికల్ రైట్స్ 85.87 కోట్లు కాగా, డిజిటల్ రైట్స్ రూపంలో రూ.25 కోట్లు ఈ చిత్రం రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం 111.87 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం.

     ఏరియాల వారీగా

    ఏరియాల వారీగా

    ఇక ఏరియాల వారీగా బిజినెస్‌ను పరిశీలిస్తే నైజాంలో రూ.21 కోట్లు, సీడెడ్ రూ.12 కోట్లు, అమెరికా రూ.7 కోట్లు, యూఎస్ యేతర ప్రాంతాల్లో 2 కోట్లు, కేరళ రూ.3 కోట్లు, బెంగళూరులో 9 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

    జిల్లాల వారీగా

    జిల్లాల వారీగా

    ఇక ఏపీలో జిల్లాల వారీగా పరిశీలిస్తే వైజాగ్ రూ.8 కోట్లు, గుంటూరు రూ.5.5 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 5.4 కోట్లు, తూర్పు గోదావరి రూ.5.4 కోట్లు, నెల్లూరు రూ.2.52 కోట్లు, కృష్ణ జిల్లాలో రూ.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

    బ్లాక్ బస్టర్ కావాలంటే

    బ్లాక్ బస్టర్ కావాలంటే

    ఇంత భారీ రేంజ్‌లో ప్రీ రిలీజ్ జరిగిన నా పేరు సూర్య బ్లాక్ బస్టర్ కావాలంటే రూ.112.5 కోట్లు, సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవాలంటే రూ.90 నుంచి రూ.112.49 కోట్లు, హిట్ టాక్ సంపాదించాలంటే రూ.75 నుంచి 90 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    ఇలా వసూలు చేస్తే

    ఇలా వసూలు చేస్తే

    ఇక యావరేజ్‌కు మంచి టాక్ సాధించాలంటే సుమారు 75 కోట్ల లోపు, యావరేజ్ హిట్ కావాలంటే 67 కోట్ల లోపు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 59 కోట్ల లోపు వస్తే ఫ్లాప్ అని, 50 కోట్లు లోపు కలెక్ట్ చేస్తే డిజాస్టర్‌గా పరిగణిస్తారు.

    English summary
    Directed by Vakkantham Vamsi, Naa Peru Surya pre-release business has crossed Rs 100 Cr mark. While worldwide theatrical rights alone valued 85.87 Cr, satellite and digital rights fetched its producers 25 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X