క్లోజింగ్ కలెక్షన్స్: భారీ నష్టాలతో ముగిసిన నా పేరు సూర్య.. అల్లు అర్జున్ కెరీర్‌లోనే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం అందరికి నిరాశని మిగిల్చి ముగిసింది. అల్లు అర్జున్ ఎంతో శ్రమించి చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ మాన్ లుక్ కోసం కొత్తగా కనిపించాడు. బన్నీ బాడీ లాంగ్వేజ్ ఈ చిత్రంలో కొత్తగా ఉంది. దర్శకుడు వక్కంతం వంశీ దేశభక్తి నేపథ్యంలో మంచికథ రాసుకున్నా బన్నీ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందించడంలో విఫలం అయ్యాడు. ఈ చిత్రంలో వినోదంతో కూడుకున్న అంశాలు తక్కువగా ఉంటాయి. నా పేరు సూర్య చిత్ర క్లోజింగ్ కలెక్షన్స్ బయ్యర్లకు తీవ్ర నిరాశ కలిగించే విధంగా ఉన్నాయి.

Recommended Video

Naa Peru Surya Movie Dissapoints Allu Arjun Fans
పెర్ఫామెన్స్ అదుర్స్

పెర్ఫామెన్స్ అదుర్స్

నా పేరు సూర్య చిత్రంలో అల్లు అర్జున్ అద్భుతమైన ఫెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆర్మీ మాన్ గా ఎంత ఎనర్జిటిక్ గా కనిపించాలో అదేవిధంగా కనిపించాడు. యాక్షన్ సీన్స్, డాన్సుల్లో అదరగొట్టాడు.

దేశభక్తి కథాంశం

దేశభక్తి కథాంశం

వక్కంతం వంశీ దేశభక్తి నేపథ్యంలో మంచి కథే రాసుకున్నారు. కానీ ఎందుకో ఆడియన్స్ కి ఈ స్టోరీ కనెక్ట్ కాలేదు. అల్లు అర్జున్ అభిమానులు కూడా నిరాశ పడ్డారు. తొలి షో నుంచి డివైడ్ టాక్ రావడంతో ఈ చిత్ర వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది.

భారీ స్థాయిలో ప్రీరిలీజ్

భారీ స్థాయిలో ప్రీరిలీజ్

నా పేరు సూర్య చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.అన్ని అన్ని ఏరియాలో కలిపి ఈ చిత్రం 80 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకుంది. కానీ అందులో 65 శాతం కూడా రికవరీ కాలేదు. నైజాం వంటి ప్రధాన ఏరియాల్లో నా పేరు సూర్య భారీ నష్టాలు మిగిల్చినట్లు తెలుస్తోంది.

క్లోజింగ్ కలెక్షన్స్

క్లోజింగ్ కలెక్షన్స్

ప్రపంచ వ్యాప్తంగా నా పేరు సూర్య చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 51 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నైజాంలో డిస్ట్రిబ్యూటర్ కు 8 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. మిగిలిన ఏరియాలలో కూడా అదే పరిస్థితి.

ఓవర్సీస్ కలెక్షన్స్

ఓవర్సీస్ కలెక్షన్స్

ఓవర్సీస్ లో నా పేరు సూర్య 10 కోట్లకు అమ్ముడైంది. అందులో కేవలం 4.10 కోట్లు మాత్రమే రికవరీ చేయగలిగింది. ఓవరాల్ గా నా పేరు సూర్య చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X