NaaSaamiRanga Box Office Collections నాగార్జునకు షాకిచ్చేలా కలెక్షన్లు..నా సామిరంగకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
మలయాళ సినిమా పొరింజు మరియం జోస్ కు రీమేక్‌గా నా సామిరంగ సినిమా రూపొందింది. తెలుగు నేటివిటికి అనుగుణంగా సంక్రాంతి పండుగ బ్యాక్ డ్రాప్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, రుక్సర్ థిల్లాన్, మిర్నా మీనన్ తదితరులు నటించారు. ఈ సినిమా భారీ పోటీ మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు జనవరి 13వ తేదీన వచ్చింది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, బ్రేక్ ఈవెన్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
Recommended Video

నా సామిరంగ సినిమాలో స్క్రిప్టు డిమాండ్ మేరకు ఎక్కువ మంది ఆర్టిస్టులతో తెరకెక్కించారు. సెట్స్, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చుతో కలిపి 65 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. అయితే ప్రమోషన్స్ కార్యక్రమాలు భారీగా చెప్పట్టినా ఈ సినిమాను కొనేందుకు బయ్యర్లు ముందుకు రాలేదు. దాంతో అడ్వాన్స్ బేస్‌తో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

ఇక నా సామిరంగ సినిమా థియేట్రికల్ రైట్స్ వ్యాల్యూ విషయానికి వస్తే. నైజాం థియేట్రికల్ హక్కులు 5 కోట్ల మేర, సీడెడ్ రైట్స్ 2.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ 8.5 కోట్లు వ్యాల్యూ కట్టారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల హక్కులు 16 కోట్ల విలువ కట్టారు. కర్ణాటక రైట్స్‌ను 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 2 కోట్ల రూపాయలకు మేర వ్యాల్యూ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 19 కోట్ల మేర విలువ కట్టారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
నా సామి రంగ సినిమా రకరకాల అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు గౌరవప్రదమైన ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది. తాజా సమాచారం ప్రకారం.. మార్నింగ్ షోకు 55 శాతం, మ్యాట్నీకి 50 శాతం, ఫస్ట్ షోకు 55 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో 43 శాతం, విజయవాడలో 57 శాతం, వరంగల్‌లో 55 శాతం, గుంటూరు 72 శాతం, వైజాగ్ 75 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది.

ఇక నా సామిరంగ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా 20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. సంక్రాంతి రేసులో సినిమాలతో పోల్చితే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు పెద్దగా కనిపించలేదు. దాంతో కరెంట్ బుకింగ్‌కు ఎక్కువ రెస్సాన్స్ లభించింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో నా సామిరంగ సినిమాకు భారీ రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ సినిమా తొలి రోజు 4 కోట్ల నెట్, 7 నుంచి 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమా 40 నుంచి 50 లక్షలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 నుంచి 8.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











