Naa Saami Ranga Business నాగార్జున మూవీకి గట్టిపోటి.. ఎన్ని కోట్లు వస్తే నా సామిరంగ లాభాల్లోకి అంటే!

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున, అమిగోస్ ఫేమ్ అషికా రంగనాథ్ జంటగా దర్శకుడిగా మారిన కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాసరావు నిర్మాతగా, పవన్ కుమార్ సహ నిర్మాతగా నిర్మించిన చిత్రం నా సామిరంగ. సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకొని విడుదల అవుతున్న ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ క్రమంలో ఈ సినిమా బడ్జెట్, జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Naa Saami Ranga Business గట్టిపోటి ఎదుర్కొని లాభాల్లోకి రావాలంటే | Telugu Oneindia

మలయాళ సినిమాకు రీమేక్‌‌గా రూపొందుతున్న నా సామిరంగ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 45 కోట్ల రూపాయలతో నిర్మించారు. టీజర్లు, ట్రైలర్లు బజ్ క్రియేట్ చేయడంతో బిజినెస్ వర్గాల్లో ఆసక్తికరమైన రెస్పాన్స్ లభించింది.

Naa Saami Ranga Pre Release Business Worldwide: Here is the Nagarjuna Akkineni movie break Even details

నా సామిరంగ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. శాటిలైట్, ఓటీటీ రైట్స్ భారీ మొత్తం లభించింది. నాన్ థియేట్రికల్ రైట్స్‌ను వేర్వేరు సంస్థలు సొంతం చేసుకొన్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ 32 కోట్ల రూపాయల మేరకు అమ్ముడుపోయాయని తెలిసింది.

ఇక నా సామిరంగ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. ఓ మోస్తారుగా అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నైజాం థియేట్రికల్ హక్కులు 5 కోట్ల మేర, సీడెడ్‌ రైట్స్ 2.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ 8.5 కోట్లు అమ్ముడుపోయినట్టు తెలిపారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల హక్కులు 16 కోట్ల మేర ట్రేడ్ జరిగినట్టు తెలిసింది.

Naa Saami Ranga Pre Release Business Worldwide: Here is the Nagarjuna Akkineni movie break Even details

ఇక తెలుగేతర రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ హక్కులకు అంతగా రెస్సాన్స్ కనిపించలేదు. సంక్రాంతి సినిమాల రిలీజ్ పోటీ ఉండటం, అలాగే స్క్రీన్లు కూడా తగినంత లేకపోవడం వల్ల తక్కువ ధరకే కోట్ చేశారు. కర్ణాటక రైట్స్‌ను 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 2 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 19 కోట్ల మేర కలెక్షన్లు నమోదు అయ్యాయి.

Naa Saami Ranga Pre Release Business Worldwide: Here is the Nagarjuna Akkineni movie break Even details

సంక్రాంతి బరిలో దిగిన నా సామిరంగ సినిమాకు గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ సినిమాల నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 16.5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించాల్సి ఉంటుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X