Naach Ga Ghuma Collections మరాఠీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత.. చిన్న చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
భారతీయ సినిమా రంగంలో మరాఠీ చిత్ర పరిశ్రమ కంటెంట్ ప్రధానంగా సాగే చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకొంటున్నది. కేవలం క్రిటిక్స్ ప్రశంసలే కాకుండా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. బాలీవుడ్ సినిమాలకు ధీటుగా కలెక్షన్లను నమోదు చేస్తున్నాయి. తాజాగా రిలీజైన నాచ్ గా ఘుమా అనే సినిమా అత్యధిక కలెక్షన్లను నమోదు చేయడం సినిమా పరిశ్రమలోని ట్రేడ్ వరగ్ాలను కన్నేసేలా చూసింది. ఈ సినిమా గురించిన వివరాలు, కలెక్షన్ల పరిస్థితి గురించి..
పరేష్ మోకాషి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్ అభయంకర్, నమత్రా అవాతే, ముక్తాభావే, రాందాస్ జాదవ్, స్వప్నిల్ జోషి, , మధుగంధ కులకర్ణి, సుకన్య కులకర్ణి తదితరులు నటించారు. తేజా దేశాయ్, స్వాప్నిల్ జోషి, పరేష్ మొకాషీ తదితరులు నిర్మించారు. మే 3వ తేదీన రిలీజైంది.

నాచ్ గా ఘుమా సినిమాను మొత్తంగా కొత్తవారు, టాలెంటెడ్ ఆర్టిస్టులతో కలిసి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమాకు మరాఠీ బాక్సాఫీస్ వద్ద క్రేజ్ లభించింది. ఈ సినిమాను అన్ని ఖర్చులతో కలిపి మొత్తంగా 8 కోట్ల రూపాయలతో నిర్మించారు.
ఇక నాచ్ గా ఘుమా అనే సినిమా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద బ్యాటింగ్ జోరుగా కొనసాగిస్తున్నది. తొలి రోజే ఈ సినిమా 2.25 కోట్లు, రెండో రోజు 1 కోటి రూపాయలు, మూడో రోజు 1.10 కోట్లు, నాలుగో రోజు 2 కోట్లు, 5వ రోజు ఈ మూవీ 2.25 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5 రోజుల్లో 8 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

ఇటీవల కాలంలో నాచ్ గా ఘుమా సినిమా రికార్డు వసూళ్లను సాధించడంతో ఇండియావైడ్ ట్రేడ్ అనలిస్టులు ఈ సినిమాపై కన్నేశారు. ఈ సినిమా కంటెంట్ అన్ని వర్గాలను ఆకట్టుకోవడంతో భారీ వసూళ్లు లభిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సినిమా కేవలం మరాఠీ భాషలోనే రిలీజ్ అయింది.


Click it and Unblock the Notifications











