Naandhi 4th day Collections: అల్లరి నరేష్ ఫెర్ఫార్మెన్స్‌కు సూపర్ టాక్.. కానీ వసూళ్లు చూస్తే..!
అల్లరి నరేష్ నటించిన నాంది చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలతో హిట్ వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రంలో నరేష్ నటనపై అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. దీంతో మొదటి రోజు నుంచి నెమ్మదిగా ప్రారంభమైన వసూళ్లు రోజు రోజుకు పెరుగుతుండటంతో ట్రేడ్ వర్గాలను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. ఈ చిత్రం 4వ రోజున ఎలాంటి కలెక్షన్లను సాధించిందంటే...

అండర్ ట్రయల్ ఖైదీగా
నాంది చిత్రంలో చేయని నేరానికి అండర్ ట్రయల్ ఖైదీగా అల్లరి నరేష్ కనిపించారు. ఈ చిత్రంలో ఆయన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. మౌత్ టాక్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే విధంగా ఉంది. ఇతర సినిమాల నుంచి భారీగా ఎదురైన పోటీ తట్టుకొని ప్రతీ రోజు మెరుగైన ఫలితాన్ని సాధిస్తున్నది.

4వ రోజు కలెక్షన్లు
ఇక నాంది చిత్రం నాలుగో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో రూ.18 లక్షలు, సీడెడ్‌లో 8 లక్షలు, ఉత్తరాంధ్రలో ఈ చిత్రం రూ.4.4 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3.3 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2.5 లక్షలు, గుంటూరులో రూ.3.9 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.3.7 లక్షలు, నెల్లూరులో రూ.2.1 లక్షలు వసూలు చేసింది.

మొత్తంగా నాంది నాలుగు రోజుల్లో
ఇక నాలుగు రోజుల్లో నాంది మొత్తంగా ఎంత వసూలు చేసిందంటే.. నైజాంలో రూ. 1.11 కోట్లు, సీడెడ్‌లో 37 లక్షలు, ఉత్తరాంధ్రలో ఈ చిత్రం రూ.23 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.19 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.15 లక్షలు, గుంటూరులో రూ.21 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.22 లక్షలు, నెల్లూరులో రూ.12 లక్షలు కలెక్ట్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే
నాంది చిత్రం నాలుగో రోజున తెలుగు రాష్ట్రాల్లో 46 లక్షల నికర వసూళ్లు రూ.85 లక్షల గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో రూ.2.60 కోట్లు నికర, రూ.4.71 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.6 లక్షలు సాధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.2.75 కోట్లు నికరంగా, 4.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లును ఈ చిత్రం రాబట్టింది.

నాంది మూవీ ప్రాఫిట్‌లోకి రావాలంటే
నాంది చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో రూ.1 కోటి, సీడెడ్‌లో రూ.30 లక్షలు, ఆంధ్రాలో రూ.1.2 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ.2.5 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.2.7 కోట్లు బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 3 కోట్లు వసూలు చేయాల్సి వస్తే.. నాలుగు రోజుల్లోనే రూ.2.75 కోట్లు రాబట్టింది. ఇంకా 25 లక్షలు రూపాయలు వసూలు చేస్తే ఇక ఈ చిత్రం లాభాల రేంజ్‌లోకి ప్రవేశించినట్టే అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి


Click it and Unblock the Notifications











