twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాంది మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా... అల్లరి నరేష్ కెరీర్‌లోనే అత్యధికంగా!

    |

    లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో భారీ అంచనాలు పెంచుకొన్న చిత్రం నాంది. తన ఇమేజ్‌కు భిన్నంగా అల్లరి నరేష్ ఈ చిత్రంలో కనిపించడంతో నాంది మూవీపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్‌కు అనుగుణంగానే నాంది చిత్రం భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసుకొన్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఏ రేంజ్‌లో వచ్చే అవకాశం ఉందంటే..

    నాందికి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా

    నాందికి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా

    నాంది చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు విశేష స్పందనను మూటగట్టుకొన్నాయి. దాంతో ఈ చిత్రంపై ప్రత్యేకమైన బజ్ ఏర్పడింది. సినిమాకు సంబంధించిన స్ట్రిల్స్, ప్రమోషన్స్ నాంది చిత్రానికి భారీ ఓపెన్సింగ్ వచ్చేలా చేశాయి.

    7 కోట్ల బడ్జెట్‌తో

    7 కోట్ల బడ్జెట్‌తో

    ఇక నాంది చిత్రం దాదాపు 7 కోట్ల మేర బడ్జెట్‌తో రూపొందింది. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడటంతో బడ్జెట్ మొత్తం రూ.8 కోట్లకు చేరుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే సుమారు రూ.9 కోట్ల వసూలు చేయాలనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

    నాంది ప్రీ రిలీజ్ బిజినెస్

    నాంది ప్రీ రిలీజ్ బిజినెస్

    నాంది చిత్రానికి క్రేజ్ భారీగా ఏర్పడటంతో బిజినెస్ కూడా హై రేంజ్‌లో జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన నైజాం హక్కులు రూ.1 కోటికి పైగా, ఆంధ్రా, సీడెడ్ హక్కులు రూ.1.5 కోట్లకుపైగా బిజినెస్ జరిగింది. ఇక శాటిలైట్, డిజిటల్ హక్కుల బిజినెస్‌తో కలిపి రూ.5 కోట్ల మేర బిజినెస్ పూర్తయింది.

    తొలి రోజు కలెక్షన్ల అంచనా

    తొలి రోజు కలెక్షన్ల అంచనా

    ఇక నాంది చిత్రం తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు సుమారు రూ. 1 కోటికిపైగా గ్రాస్ వసూళ్లను, తెలుగు రాష్ట్రాల్లో సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారీ వసూళ్లు వారాంతం వరకు కొనసాగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

     అల్లరి నరేష్ కెరీర్‌లో

    అల్లరి నరేష్ కెరీర్‌లో

    ఇక నాంది చిత్రం వసూళ్లు అల్లరి నరేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లను నమోదు చేసుకొన్నాయి. తొలి రోజు ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో వేచి చూడాల్సిందే.

    English summary
    As per wikipedia, Naandhi is action crime thriller film directed by Vijay Kanakamedala and produced by Satish Vegesna. The film stars Allari Naresh, Varalaxmi Sarathkumar, and Priyadarshi Pullikonda, while Harish Uthaman and Praveen play supporting roles. This movie hits the theatres on Feb 19th, 2021
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X