కల్కి 2898 AD మూవీలో గ్రాఫిక్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చు పెట్టారా? ఆ టెక్నాలజీ ఏంటో తెలుసా?
చాలా కాలం తర్వాత తెలుగు నుంచి వచ్చిన ఓ పాన్ ఇండియా సినిమా అయితే సెన్సేషనల్ వసూళ్లు అందుకొని మళ్ళీ తెలుగు సినిమా సత్తా చాటుతుంది. కాగా ఆ సినిమానే పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఎడి". యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథలాజి అండ్ సైన్స్ ఫిక్షన్ మిక్స్డ్ డ్రామా అనుకున్న దానికంటే భారీ సక్సెస్ అయ్యింది.
అయితే ఈ సినిమా విజయం సాధించడంలో భారీ తారాగణం శ్రమతో పాటుగా దర్శకుడు నాగ్ అశ్విన్ కమిట్మెంట్ కూడా చాలానే ఉందని చెప్పాలి. మెయిన్ గా ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ లో సినిమా విజువల్స్ ఆర్ట్ అంతా చాలా కీలక పాత్ర వహించింది. ఈ సినిమాలో 6 వేల సంవత్సరాల వెనక్కి అలాగే మనం ఇప్పుడు ఉన్న కాలం నుంచి ఇంకో 900 సంవత్సరాలు ముందుకు వెళ్లాల్సిన సన్నివేశాలు ఉన్నాయి.

అయితే గతంలో సన్నివేశాలు భవిష్యత్తులో నగరాలు శంబాలా లాంటివి ఇలానే ఉంటాయా అనేవి కళ్ళకు కట్టినట్టుగా మేకర్స్ చూపించారు. మరి ఇందులో గ్రాఫిక్స్ కే చాలా పని పడుతుంది. స్క్రీన్ పై చూసిన సన్నివేశాలు చాలానే అబద్దాలు ఉంటాయి. మరి అలాంటి వాటి అన్నిటిని వి ఎఫ్ ఎక్స్ తోనే చేయాల్సి ఉంటుంది. అలా ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీటితోనే మొత్తం పని పడినట్టు అనిపిస్తుంది.
అలాగే బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ని కూడా యంగ్ గా చూపించేందుకు డీ ఏజింగ్ టెక్నాలజీ వినియోగించారు. ఇలా చాలానే గ్రాఫిక్స్ సాయంతో చూపించి నాగ్ అశ్విన్ మెస్మరైజ్ చేసాడు. అసలు మరి ఇంతలా కీలక పాత్ర పోషించిన ఈ గ్రాఫిక్స్ కోసం మేకర్స్ ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఈ సినిమా మొత్తానికి వీరు పెట్టిన ఖర్చు ఏకంగా 150 కోట్ల పైమాటే అట.. ఇది షాకింగ్ మొత్తమే అని చెప్పాలి.

సరిగ్గా ఇదే బడ్జెట్ తో దర్శక దిగ్గజం రాజమౌళి ఇదే ప్రభాస్ తో కొన్నేళ్ల కితం బాహుబలి 1 అనే సినిమా ఇదే ప్రభాస్ ని హీరోగా పెట్టి తీసేసాడు. అక్కడ నుంచి సినిమాల స్కేల్ పెరుగుతూనే వస్తూ ఉన్నాయి. సో క్వాలిటీకి డిమాండ్ పెరుగుతుండడంతో వాటికి కూడా ధరలు పెంచుతున్నారు. సో బడ్జెట్ లు కూడా పెరిగిపోతున్నాయి. అయితే కల్కి కి ఇంత మొత్తం పెట్టినప్పటికీ మహాభారతం ఎపిసోడ్స్ మాత్రం అంత నాచురల్ గా తీసుకురాలేకపోయారు.
మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమన్నా దీనిని బెటర్ గా చేస్తారేమో అనేది చూడాలి. కాగా ఈ మహా ప్రాజెక్ట్ లో ప్రభాస్, అమితాబ్ సహా కమల్ హాసన్, దీపికా పదుకొనె లాంటి అగ్ర తారాగణం కూడా నటించగా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ తదితరులు నటించారు. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని 700 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం వహించారు.


Click it and Unblock the Notifications











