మొన్న 50 కోట్ల ట్రైలర్, ఇప్పుడు 50 రోజుల ట్రైలర్

By Srikanya

హైదరాబాద్: నాగార్జున హీరోగా నటించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయినా. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్స్ రికార్డ్ లు బ్రద్దలు కొడుతూ భాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. రీసెంట్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది ఈ సందర్బంగా 50 రోజుల ట్రైలర్ వదిలారు. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడవచ్చు.

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయన'. సంక్రాంతి కానుకగా విడుదలై ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి పండుగ వెళ్లిపోయినా కలెక్షన్స్ లో తన మ్యాజిక్ ని కొనసాగిస్తోంది. ఈ చిత్రానికి కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.

Nag's Soggade Chinni Nayana 50 Days Trailer

ఇంతకు ముందు కొద్ది రోజుల క్రితం ... ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరినందుకుగాను ఓ స్పెషల్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఇలా 50 కోట్లు, 50 రోజుల ట్రైలర్స్ విడుదల చేయటం ఈ మధ్యకాలంలో ఈ చిత్రమే. దానిని మీరు ఇక్కడు చూడండి.

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌,నాగబాబు, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, హంసానందిని, యాంకర్‌ అనసూయ, దీక్షా పంత్‌, బెనర్జీ, సురేఖా వాణి, దువ్వాసి మోహన్‌, రామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: పి.రామ్మోహన్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, నిర్మాత: అక్కినేని నాగార్జున, మాటలు-దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X