»   » ఆ కలెక్షన్స్ వర్షమే ఇంకా కంటిన్యూ అవుతోంది (ట్రేడ్‌టాక్)

ఆ కలెక్షన్స్ వర్షమే ఇంకా కంటిన్యూ అవుతోంది (ట్రేడ్‌టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రిందటి వారం రిలీజైన నాగచైతన్యకు తన తాజా చిత్రం '100 లవ్" మరో విజయాన్ని సాధించి కలెక్షన్స్ వర్షం కురుపిస్తోంది. ఇక ఈ చిత్రం మొదటి వారం దాదాపు పదకొండు కోట్ల ఇరవై ఆరు లక్షలు వరకూ వసూలు చేసింది. ఈ చిత్రం బడ్జెట్ పదకొండు కోట్లు. దాంతో ఈ చిత్రం అప్పుడే ప్రాఫిట్ లోకి వచ్చిందని చెప్తున్నారు. లాంగ్ రన్ లో దాదాపు 20 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని భావిస్తున్నారు. నూటయాభై ప్రింట్లతో దాదాపు 250 ధియోటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ధియోటర్స్ త్వరలోనే పెంచే ఆలోచనలో నిర్మాత బన్నీ వాసు ఉన్నారు. అలాగే ఈ వారం అల్లరి నరేష్ హీరోగా విడుదలైన సీమ టపాకాయ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సాదా సీదా ప్రారంభమై ఆ తర్వాత సీమ ఫ్యాక్షన్ లోకి చొరబడి సింహా, ఖలేజా చిత్రాల ప్యారడీలతో ముగిసింది. చిత్రంలో ఆకాశంలో ఒక తార పాట రీమిక్స్ మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. తమిళ డబ్బింగ్ చిత్రం రంగం మంచి టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం కనపడటం లేదు. తమిళ హీరో జీవాకు ఇక్కడ మార్కెట్ కోసం ఈ సినిమాతో ప్రయత్నం చేసారు కానీ అది వర్కవుట్ కావటం లేదు.

English summary
Naga Chaitanya's '100% Love' released last week and secured unanimous Super hit talk from all classes of Audience and is running successfully. Meanwhile, Trade sources revealed the First day collections of the film which are around Rs. 2 Crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu