Custody Collection: నాగ చైతన్య కస్టడీకి షాకింగ్ కలెక్షన్స్.. 4 రోజుల్లో ఇంతే! టార్గెట్ రీచ్ కావాలంటే?
నాగ చైతన్య కెరీర్ లో బైలింగువల్ ప్రాజెక్ట్ గా వచ్చిన సినిమా కస్టడీ. ఈ మూవీ నాగ చైతన్యకు చైతూకి తొలి తమిళ స్ట్రెయిట్ సినిమా. దీనికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా కృతీ శెట్టి మరోసారి నాగ చైతన్యతో జోడీ కట్టింది. ఈ సినిమాలో నాగ చైతన్య ఎప్పుడు చేయని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
అయితే ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మే 12న విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంటోంది. అందుకు అనుగుణంగానే వసూళ్లు ఉంటున్నాయి. ఈ క్రమంలో కస్టడీ 4వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

అలాంటి టాక్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన కస్టడీ చిత్రంలో ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి కస్టడీ సినిమాకు సంగీతం అందించిన ఈ సినిమా మే 12న విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తూ యావరేజ్ అని రివ్యూలు చెబుతున్నాయి.

ప్రీరిలీజ్ బిజినెస్: నాగ చైతన్య తాజా సినిమా 'కస్టడీ'కి తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రాలో రూ. 8.50 కోట్లతో అన్నీ కలిపి రూ. 18.20 కోట్ల బిజినెస్ అయింది. కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.25 కోట్ల బిజినెస్ జరిగింది. ఇవన్నీ కలుపుకుని మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ. 24.05 కోట్ల బిజినెస్ అయింది.

తెలుగు ఆక్యుపెన్సీ: కస్టడీ సినిమాకు మొదటి రోజు నుంచి మిక్స్ డ్ టాక్ రావడంతో ప్రేక్షకులు చూసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని థియేటర్ ఆక్యుపెన్సీ ద్వారా తెలుస్తోంది. ఇక వర్కింగ్ డే అయిన సోమవారం రోజున తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ వివరాలు చూస్తే.. ఉదయం షోలకు 10.91%, మధ్యాహ్నం షోలకు 15.79%, సాయంత్రం షోలకు 14.92% ఆక్యుపెన్సీ నమోదు అయినట్లుగా సమాచారం.

తమిళ ఆక్యుపెన్సీ: నాగ చైతన్య కస్టడీని తమిళంలో కూడా తెరకెక్కించిన విషయం తెలిసిందే. డైరెక్టర్ వెంకట్ ప్రభుకు అక్కడ మంచి క్రేజ్ ఉంది. అయితే కస్టడీ విడుదలైన తర్వాత ఆయన క్రేజ్ కూడా పెద్దగా పని చేయలేదు. ఫలితంగా తమిళంలో కూడా కస్టడీకి పెద్దగా ఆక్యుపెన్సీ రావట్లేదు. తమిళంలో ఉదయం షో లకు 14.94%, మధ్యాహ్నం షోలకు 17.97%, సాయంత్రం షోలకు 17.56% నమోదు అయింది. ఇలా చూస్తే తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు తెలుస్తోంది.

4వ రోజు.. బ్రేక్ ఈవెన్ కావాలంటే?: నాగ చైతన్య-కృతీ శెట్టి మరోసారి జోడీ కట్టిన కస్టడీ చిత్రానికి 4వ రోజున రూ. 1 కోటి నెట్ ఇండియా కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే మూవీ విడుదలైన రోజు నుంచి చూసుకుంటే నాలుగో రోజే అతి తక్కువ వసూళ్లు వచ్చినట్లు.
ఇక 4 రోజుల్లో మొత్తంగా రూ. 7.63 నెట్ కలెక్షన్స్ వసూళు కానున్నాయట. మొత్తంగా 4వ రోజున రూ. 40 నుంచి 50 లక్షల షేర్ కలెక్షన్స్ రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక సినిమాకు బ్రేక్ ఈవెన్ ఫినిష్ కావాలంటే మరో రూ. 19 కోట్లకుపైగా రావాల్సిందే.


Click it and Unblock the Notifications











