Custody Collection: నాగ చైతన్య కస్టడీలో లేని ప్రేక్షకులు.. ఊహించని వసూళ్లు.. ఇక కష్టమే!

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తనయుడిగా వెండితెరపై అడుగుపెట్టిన చైతూ మొదట్లో లవర్ బాయ్ గా మంచి హిట్స్ అందుకున్నాడు. తర్వాత మాస్ హీరోగా స్టార్ డమ్ తెచ్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు.

ఇక ఇటీవల ఆయన సినిమాలు అనుకున్నంతగా హిట్ కావట్లేదు. తాజాగా ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ సినిమాకు కూడా అంతంతమాత్రంగానే మౌత్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో కస్టడీ మూవీ ఐదవ రోజు వసూళ్లపై లుక్కేస్తే..

Naga Chaitanya Custody Day 5 Expected Worldwide Box Office Collection

తండ్రీకొడుకులు: నాగ చైతన్యకు జోడీగా ముద్దుగుమ్మ కృతి శెట్టి రెండోసారి నటించిన సినిమా కస్టడీ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ తెలుగు, తమిళ ద్విభాష చిత్రానికి తండ్రీ కొడుకులు అయిన ఇళయరాజు, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం. అట్టహాసంగా మే 12న విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది.

Naga Chaitanya Custody Day 5 Expected Worldwide Box Office Collection

ప్రీరిలీజ్ వివరాలు: నాగ చైతన్యకు తగినట్లుగానే 'కస్టడీ' మూవీకి బిజినెస్ అయింది. నైజాం రూ. 7.50 కోట్లు, సీడెడ్‌ రూ. 2.20 కోట్లు, ఆంధ్రా అన్ని ఏరియాలో కలిపి రూ. 8.50 కోట్లతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. ఇక కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.25 కోట్లతో అన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 24.05 కోట్ల మేర బిజినెస్ అయింది.

Naga Chaitanya Custody Day 5 Expected Worldwide Box Office Collection

ఆక్యుపెన్సీ డీటెల్స్: కస్టడీ సినిమాకు విడుదలైన తొలి రోజు నుంచే మిశ్రమ స్పందన లభిస్తోంది. అందుకే ఆడియెన్స్ కు మూవీ అంతగా రుచించట్లేదు. దీని ప్రభావం థియేటర్ ఆక్యుపెన్సీపైన పడింది. ఈ నేపథ్యంలో కస్టడీ 5వ రోజు తెలుగు థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఉదయం షోలకు 12.09%, మధ్యాహ్నం షోలకు 14.94%, సాయంత్రం షోలకు 14.16% ఆక్యుపెన్సీ నమోదు అయినట్లుగా అంచనా వేశారు.

Naga Chaitanya Custody Day 5 Expected Worldwide Box Office Collection

తమిళంలో అలా: తమిళ అగ్ర దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన కస్టడీ సినిమాపై కోలీవుడ్ ఆడియెన్స్ సైతం విముఖత చూపిస్తున్నారని అక్కడి థియేటర్ ఆక్యుపెన్సీ చూస్తే తెలుస్తోంది. 5వ రోజున అక్కడ ఉదయం షో లకు 15.61%, మధ్యాహ్నం షోలకు 19.33%, సాయంత్రం షోలకు 17.26% నమోదు అయింది. ఇలా చూస్తే ఐదవ రోజు కూడా తెలుగులో కంటే తమిళంలోనే మళ్లీ ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

ఏ రోజు ఎలా అంటే?: చైతూ కస్టడీ సినిమాకు తొలి రోజున రూ. 3.2 కోట్లు, రెండో రోజున రూ. 1.68 కోట్లు, 3వ రోజు రూ. 1.75 కోట్లు, నాల్గవ రోజు రూ. 95 లక్షలు నెట్ ఇండియా కలెక్షన్స్ కలెక్ట్ అయ్యాయి. అంటే ఈ వరుస క్రమం చూస్తే రోజురోజుకీ కస్టడీ వసూళ్లు తగ్గుతున్నట్లుగా అర్థం అవుతోంది. ఇక 5వ రోజున రూ. మరింత తక్కువగా రూ. 75 లక్షల నెట్ కలెక్షన్స్ వసూలు కానున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.

Naga Chaitanya Custody Day 5 Expected Worldwide Box Office Collection

టార్గెట్ డౌటే: నాగ చైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ చిత్రానికి 5 రోజుల్లో రూ. 8.33 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూళు కానున్నట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇక దీనికి వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో రూ. 5.37 కోట్లు షేర్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఐదో రోజున రూ. 30 లక్షల షేర్ కలెక్షన్స్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 19.30 లక్షల వసూళు కావాలని తెలుస్తోంది. కానీ సినిమాకు వస్తున్న టాక్ దృష్ట్యా దాన్ని చేరుకుంటుందో లేదే అని అనుమానంగానే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X