Custody Collection: కలెక్షన్లలో కష్టపడుతున్న 'కస్టడీ'.. 6వ రోజు ఇంతే.. నాగ చైతన్య హిట్టు కొడతాడా?
అక్కినేని నాగార్జున కుమారుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తనదైన నటనతో ముందుగు సాగుతున్నాడు. జోష్ మూవీతో హీరోగా పరిచయం అయిన చైతూ సినీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు కావొస్తుంది. అయితే గత కొంతకాలంగా నాగ చైతన్య సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కావట్లేదు.
ఈ క్రమంలో ఎలాగైనా మంచి హిట్ కొడతాడు అని ఫ్యాన్స్ భావించిన సినిమా కస్టడీ. మే 12న ఎన్నో ఆశలతో విడుదలైన ఈ సినిమాకు ఊహించని టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా 6వ రోజు వసూళ్ల విషయానికొస్తే..

మానాడుతో సక్సెస్ ట్రాక్: కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుకు తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉంది. గత కొంతకాలంగా ఆయన సినిమాలు అంతగా వర్కౌట్ కావడం లేదు. కానీ శింబుతో తెరకెక్కించిన మానాడుతో మళ్లీ వెంకట్ ప్రభు సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడనుకున్నారు. అయితే ఊహించని విధంగా మళ్లీ నాగ చైతన్యతో బైలింగువల్ ప్రాజెక్టుగా చేసిన కస్టడీ సినిమాకు మిశ్రమ స్పందన రావడం ఆలోచింపజేసేలా ఉంది.

బిజినెస్ డీటేల్స్: హీరోగా నాగ చైతన్యకు చిత్ర పరిశ్రమలో మంచి మార్కెటే ఉంది. దానికి తగినట్లుగానే 'కస్టడీ' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 18.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.25 కోట్లు కాగా.. ఇవన్నీ కలిపి వరల్డ్ వైడ్ గా రూ. 24.05 కోట్ల మేర బిజినెస్ అయింది.

థియేటర్ ఆక్యుపెన్సీ: కస్టడీ సినిమాకు ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. కానీ మే 12న రిలీజ్ కాగా ఆ రోజు నుంచి యావరేజ్ టాక్ రావడం మొదలైంది. ఇప్పటికీ 5 రోజులు పూర్తి చేసుకున్న నాగ చైతన్య సినిమాకు 6వ రోజున తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువగానే ఉంది. ఉదయం షోలకు 11.68%, మధ్యాహ్నం షోలకు 13.62%, సాయంత్రం షోలకు 13.16% ఆక్యుపెన్సీ నమోదు అయినట్లుగా తెలుస్తోంది.

తమిళ ఆక్యుపెన్సీ: డైరెక్టర్ వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే, టేకింగ్ కు సెపరేట్ మార్క్ ఉంది. అందుకే ఆయన సినిమాలపై మంచి హోప్స్ పెట్టుకుంటారు. కానీ కస్టడీ మాత్రం నిరాశ పరిచినట్లుగా ఆక్యుపెన్సీ చూస్తే అర్థం అవుతోంది. కస్టడీ మూవీ తమిళంలో ఆక్యుపెన్సీ తెలుగు కంటే ఎక్కువగా ఉన్నా.. వెంకట్ ప్రభు రేంజ్ కి తక్కువే అని మాటలు వినిపిస్తున్నాయి. ఆరో రోజున ఉదయం 15.68%, మధ్యాహ్నం 17.83%, సాయంత్రం 17.26 శాతంగా ఉంది.

6వ రోజు ఎంతంటే?: కస్టడీ చిత్రానికి 6వ రోజున రూ. 80 లక్షల నెట్ ఇండియా కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే సినిమా రిలీజైన రోజు నుంచి చూస్తే ఇదే తక్కువగా వచ్చినట్లు. ఇక ఈ సినిమాకు 6 రోజుల్లో రూ. 9.28 ఇండియా నెట్ కలెక్షన్స్ నమోదు కానున్నాయట. అయితే 6వ రోజు రూ. 40 నుంచి 50 లక్షల షేర్ రానున్నట్లు అర్థం అవుతోంది. కస్టడీకి బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 18.50 కోట్లకుపైగా కలెక్ట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











