Custody Movie Day 3 Collections: మూడవ రోజు పెరిగినా లాభం లేదు.. ఇంకా ఎంత రావాలంటే?

నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి మెయిన్ హీరోయిన్ గా నటించగా శరత్ బాబు ముఖ్యమైన పాత్రలో నటించారు. అయితే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇక మూడవ రోజు కూడా కలెక్షన్స్ ఆశించినంత స్థాయిలో ఏమీ రాలేదు. కాస్త పెరిగినప్పటికీ కూడా పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలి అంటే ఈ స్థాయిలో కలెక్షన్స్ అయితే సరిపోవు. ఇక మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

కస్టడీ వినిమా బిజినెస్:కస్టడీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేసింది. నైజాంలో 7.5 కోట్లు సీడెడ్ లో 2. 20 కోట్లు ఆంధ్ర మొత్తంలో 8.50 కోట్ల రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి 18.21 ఓట్ల రేంజ్ లో అయితే ఈ సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం. అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 1.2 కోట్లు, 2.4 కోట్ల రేంజ్ లో ఈ సినిమా అమ్ముడైనట్లు సమాచారం. తెలుగులో టోటల్ గా 21.80 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది. ఈ సినిమా తమిళ వెర్షన్ 2.5 కోట్ల నుంచి మూడు కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ లెక్కన చూస్తే రెండు భాషల్లో కలుపుకొని కస్టడీ సినిమా 23.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసినట్లుగా తెలుస్తోంది.

Naga Chaitanya custody Movie Day 3 expected collections

తెలుగులో థియేట్రికల్ ఆక్యుపెన్సీ:ఇక కస్టడీ సినిమా మొదటి రెండు రోజులో థియేట్రికల్ ఆక్యుపెన్సీ అంతగా నమోదు కాలేదు. ఇక మూడవ రోజు ఆదివారం కావడంతో అక్కడక్కడా కాస్త గ్రోత్ కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే.. మొదటి రోజే ఈ సినిమాకు కాస్త డివైడ్ టాక్ రావడం వలన మిగతా రోజుల షోలకు సంబంధించి థియేట్రికల్ ఆక్యుపెన్సి చాలా వరకు తగ్గిపోయింది. తెలుగులో ఉదయం షోలకు 14.31% మధ్యాహ్నం షోలకు 25.54% సాయంత్రం షోలకు 27.85% ఆక్యుపెన్సీ నమోదు అయినట్లుగా తెలుస్తోంది.

Naga Chaitanya custody Movie Day 3 expected collections

తమిళంలో థియేట్రికల్ ఆక్యుపెన్సీ:తమిళంలో కూడా ఈ సినిమా వందకు పైగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే అక్కడ కూడా పెద్దగా పాజిటివ్ టాక్ ఏమీ అందుకోలేదు. తమిళంలో కస్టడీ సినిమా ఆదివారం ఉదయం షో లకు 18.7% మధ్యాహ్నం షోలకు 31.60% సాయంత్రం షోలకు 31.89% నమోదు చేసుకుంది. తమిళంలో వెంకట్ ప్రభుకి మంచి క్రేజ్ ఉన్నప్పటికీ కూడా కస్టడీ సినిమాకు మొదటిరోజు అంతగా హెల్ప్ అయితే అవ్వలేదు.

Naga Chaitanya custody Movie Day 3 expected collections

ఏపీ నైజాంలో..:మూడవ రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవచ్చు అని వివరాల్లోకి వెళితే.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు చాలా తక్కువ ఓపెనింగ్స్ అయితే అందే అవకాశం ఉంది. మొదటి రోజు ఏపీ నైజాంలో కలుపుకొని ఈ సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవచ్చు అనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Naga Chaitanya custody Movie Day 3 expected collections

3వ రోజు టోటల్ కలెక్షన్స్:ఇండియా మొత్తంలో చూసుకుంటే కస్టడీ సినిమా ఆదివారం రోజు 1.75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో అయితే కలెక్షన్స్ ఏమీ రాలేదు. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కస్టడీ సినిమా మూడవ రోజు 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇలా అయితే సినిమా టార్గెట్ ఫినిష్ అవ్వడానికి ఏమాత్రం సరిపోదు.

Naga Chaitanya custody Movie Day 3 expected collections

ఇంకా ఎంత రావాలి అంటే..:మొత్తంగా మూడు రోజిల్లో కస్టడీ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.50 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంది. వీకెండ్ తర్వాత కూడా సినిమా ఇదే తరహాలో కొనసాగితేనే ఎంతోకొంత నష్టాల భారీ నుంచి బయటపడుతుంది. కస్టడీ బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది. ఇంకా సినిమాకు 20 కోట్లకు పైగా షేర్ రావాల్సి ఉంది. మరి ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో లేదో రేపటి కలెక్షన్స్ ను బట్టి తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X