అల్లు అర్జున్ ని ఫాలోచేస్తున్న ఇద్దరూ
అల్లు అర్జున్ ఇప్పుడు మిగతా హీరోలకు కూడా మార్గదర్శకుడుగా మారుతున్నాడు. మళయాళంలో అతను దాదాపు ఒక కోటి రూపాయల వరకూ మార్కెట్ ఏర్పాటు చేయటంతో తాము అదే రూటులో వెళ్ళాలని నాగచైతన్య, నాని నిర్ణయించుకున్నారు. తమ హిట్ సినిమాలను అక్కడ కూడా విడుదల చేసి తమ మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన హ్యాపీ సినిమా మొదట కేరళలో డబ్ అయ్యి అక్క్డడ బాగా ఆడింది.దాంతో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ చేయటం అక్కడ మొదలైంది.
తెలుగులో ప్లాప్ అయిన సినిమాలు కూడా అక్కడ మంచి రెవిన్యూనే సంపాదించటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇదే స్టాటజీని నాగచైతన్య, నాని కూడా తమ చిత్రాలను వర్తింపచేయదలచుకున్నారు. నాగచైతన్య లేటెస్ట్ హిట్ 100% లవ్ ని, నాని తన హిట్ అలా మొదలైందిని మళయాళంలో విడుదల చేసేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డబ్బింగ్ వర్క్ లను ప్రత్యేక శ్రద్దతో పూర్తిచేసారు ఈ ఇద్దరు హీరోలు. మళయాళ స్ట్రైయిట్ సినిమాలా తమ సినిమా కనపించాలని వారి తాపత్రయం. నిర్మాతలు కూడా ఇలా ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్న హీరోలను చూసి ముచ్చటపడుతున్నారు. గతంలో లేని విధంగా తమిళ, మళయాళ మార్కెట్ లపై మన హీరోలు పూర్తి దృష్టి పెట్టడం శుభపరిణామమే అంటున్నారు.


Click it and Unblock the Notifications











