For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Love Story 2 Weeks Collections: 32 కోట్ల టార్గెట్.. రెండు వారాల్లోనే నిర్మాతలకు అన్ని లాభాలు

  |

  అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న ఈ స్టార్ కిడ్.. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'మజిలీ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరి' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు వారాల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

   రేవంత్, మౌనిక ‘లవ్ స్టొరీ' వచ్చింది

  రేవంత్, మౌనిక ‘లవ్ స్టొరీ' వచ్చింది

  నాగ చైతన్య హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం 'లవ్ స్టోరీ'. సాయి పల్లవి హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ మూవీకి సంగీతం అందించాడు. కొత్త ప్రేమకథతో రూపొందిన ఇది ఇటీవలే వచ్చింది.

  బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్‌లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!

  అంచనాలకు తగ్గట్టే భారీగా ప్రీ బిజినెస్

  అంచనాలకు తగ్గట్టే భారీగా ప్రీ బిజినెస్

  'లవ్ స్టోరి' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి దీని నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ చేసుకుందట.

   14వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది?

  14వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది?

  'లవ్ స్టోరి'కి తెలుగు రాష్ట్రాల్లో 14వ రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.80 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.60 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1.50 లక్షలు, గుంటూరులో రూ. 70 వేలు, కృష్ణాలో రూ. 1.30 లక్షలు, నెల్లూరులో రూ. 80 వేలు వచ్చాయి. దీంతో రూ. 15 లక్షలు షేర్, రూ. 28 లక్షలు గ్రాస్ వచ్చింది.

  మహేశ్ మూవీ నుంచి చెప్పకుండా తీసేశారు.. ఆ అమ్మాయి వల్ల నాపై కేసు పెట్టారు: నోరు విప్పిన ప్రకాశ్ రాజ్

  14 రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే

  14 రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే

  'లవ్ స్టోరీ'కి 14 రోజులకు ఏపీ, తెలంగాణలో మంచి కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో రూ. 11.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.87 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.56 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.1.32 కోట్లు, గుంటూరులో రూ. 1.47 కోట్లు, కృష్ణాలో రూ. 1.32 కోట్లు, నెల్లూరులో రూ. 86 లక్షలతో.. మొత్తం రూ. 25.62 కోట్లు షేర్, రూ. 41.70 కోట్లు గ్రాస్‌ వచ్చింది.

  ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

  ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

  తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.62 కోట్లు రాబట్టిన 'లవ్ స్టోరీ' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.05 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.81 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే పద్నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 32.48 కోట్లు షేర్‌తో పాటు రూ. 58 కోట్లు గ్రాస్ వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

  అరాచకమైన డ్రెస్‌తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!

  Recommended Video

  Make-Up Artist Sadhana Singh About Samantha & Preetham Jukalkar Relationship || Filmibeat Telugu
  బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఎంత వచ్చింది

  బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఎంత వచ్చింది

  ఎన్నో అంచనాల నడుమ వచ్చిన 'లవ్ స్టోరీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజులకు కలిపి దీనికి రూ. 32.48 కోట్లు వచ్చాయి. అంటే క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకోవడంతో పాటు రూ. 48 లక్షలు లాభాలను కూడా నిర్మాతలు అందుకున్నారు.

  English summary
  Naga Chaitanya and Sai Pallavi Did Love Story Movie Under Sekhar Kammula Direction. This Movie Collect 32.48 Cr in 14 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X