Love Story 8Days Collections: మళ్లీ పెరిగిన లవ్ స్టోరీ కలెక్షన్స్.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్

కరోనా సెకెండ్ వేవ్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ పరిస్థితి ఏమంత బాగోలేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతుండడం.. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యూ తదితర కారణాలతో చాలా సినిమాలు విడుదలైనా.. అందులో ఒకటి రెండు మాత్రమే హిట్ అయ్యాయి. మిగితా వాటిలో పలు చిత్రాలకు మంచి టాక్ ఉన్నా ప్రతికూల పరిస్థితుల కారణంగా నష్టాలనే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'లవ్ స్టోరీ'. నాగ చైతన్య.. సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

‘లవ్ స్టొరీ'తో వచ్చేసిన రేవంత్.. మౌనిక

‘లవ్ స్టొరీ'తో వచ్చేసిన రేవంత్.. మౌనిక

అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ దీనికి సంగీతం సమకూర్చాడు. సున్నితమైన ప్రేమకథతో ఇది రూపొందింది.

ఆరంభం నుంచే అంచనాలు... బిజినెస్‌

ఆరంభం నుంచే అంచనాలు... బిజినెస్‌

'లవ్ స్టోరీ' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి దీని నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది. సెకెండ్ వేవ్ తర్వాత ఇదే భారీ బిజినెస్ కావడం విశేషం.

 8వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది?

8వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది?

'లవ్ స్టోరీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 8 రోజు కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 19 లక్షలు, సీడెడ్‌లో రూ. 11 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలు వచ్చాయి. దీంతో మొత్తం రూ. 49 లక్షలు షేర్, రూ. 82 లక్షలు గ్రాస్ వచ్చింది.

 8 రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే

8 రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే

'లవ్ స్టోరీ'కి 8 రోజులకు ఏపీ, తెలంగాణలో భారీ కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో రూ. 10.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.67 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.38 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.1.16 కోట్లు, గుంటూరులో రూ. 1.33 కోట్లు, కృష్ణాలో రూ. 1.15 కోట్లు, నెల్లూరులో రూ. 73 లక్షలతో.. మొత్తం రూ. 22.72 కోట్లు షేర్, రూ. 36.92 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

తెలుగు రాష్ట్రాల్లో రూ. 22.72 కోట్లు కొల్లగొట్టిన 'లవ్ స్టోరీ' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.56 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 28.78 కోట్లు షేర్‌తో పాటు రూ. 51.15 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఇంకెంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఇంకెంత రావాలి?

క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'లవ్ స్టోరీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32 కోట్లుగా నమోదైంది. ఇక, ఎనిమిది రోజులకు కలిపి దీనికి రూ. 28.78 కోట్లు వచ్చాయి. అంటే మరో 3.22 కోట్లు వస్తే నాగ చైతన్య - సాయి పల్లవి సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X