Thandel Day 1 Collections : ‘తండేల్’ తెలుగు స్టేట్స్ కలెక్షన్.. చైతూ డే1 కలెక్షన్స్ ఎంతంటే?
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య - చందూ మొండేటి కాంబోలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్'. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదలైంది. తెలుగు, తమిళం, హిందీతో పాటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా విడుదలైంది. తొలిరోజైతే ఆడియెన్స్ ను మెప్పించిన విధంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. తొలిరోజు ఈ చిత్రానికి మంచి రెస్పాన్సే దక్కింది. ఈ సందర్భంగా చైతూ సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ ఎంతనేది ఆసక్తికరంగా మారింది. అన్ని చోట్ల నుంచి చైతూ సినిమాకు కాస్తా మెరుగైన ఫలితాలే వచ్చాయని ట్రేడ్ నిపుణులు తెలియజేస్తున్నారు. వాటి ప్రకారం.. 'తండేల్' మొదటిరోజు తెలుగు స్టేట్స్ అండ్ వరల్డ్ వైడ్, హిందీ, తమిళంలో కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తాజాగా ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన వివరాల ప్రకారం.. తండేల్ మొదటి రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లోనే ఈ చిత్రం రూ.10 కోట్ల వరకు వసూళ్లను రాబట్టడం ఆసక్తికరంగా మారింది. చైతూ సినిమాకు ఇంత మంచి నెంబర్ రావడం విశేషం. వరల్డ్ వైడ్ కూడా మంచి రెస్పాన్సే అందుకుంది. రూ.19 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూల్ చేసింది. చైతూ ప్రయోగానికి ఇది ఓ ఇంత మంచి రిజల్టే అని చెప్పాలి.

ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రానికి ఏరియా వైజ్ ఇలా వసూళ్లు అందాయి. నైజాం... 5.50 కోట్లు, వైజాగ్...1.80 కోట్లు, సీడెడ్....2.00 కోట్లు, ఈస్ట్...0.95 కోట్లు, వెస్ట్...0.60 కోట్లు, కృష్ణా..0.95 కోట్లు, గుంటూరు.. 0.80 కోట్లు, నెల్లూరు.. 0.50 కోట్లు వసూళ్లు చేసింది. తెలుగు స్టేట్స్ లో మొత్తం రూ.9.8 కోట్లు, హిందీలో.. 15 లక్షలు, తమిళంలో.. 5 లక్షలు వసూళ్లు చెందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
అక్కినేని నాగచైతన్య కెరీర్ లో ఈ చిత్రానికి తొలిరోజు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పాలి. ఇక రెండో, మూడో రోజు వీకెండ్ రావడంతో మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్రంలోని చైతూ, సాయిపల్లవి మెప్పించే పెర్ఫామెన్స్, చందూ మొండేటి కథనానికి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో శని, ఆదివారాల్లో మరింతగా నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇక ఈ చిత్రంలో నాగచైతన్య శ్రీకాకుళం ఫిషర్ మెన్ పాత్రలో జీవించారు. చైతూ తన పెర్ఫామెన్స్ తో మాత్రం ఫ్యాన్స్ బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఫ్యూర్ లవ్ స్టోరీతో ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. వీరి నటనతో పాటు చందూ మొండేటి దర్శకత్వ మెళకువలు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా మెప్పించేలా ఉన్నాయి. మరోవైపు మూవీలోని లవ్ అండ్ ఎమోషనల్, దేశభక్తి సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఉర్రూతలూగిస్తోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత బన్నీవాసు నిర్మించారు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేశారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ప్రకాశ్ బేల్వాడి, దివ్వ పిల్లై, రావు రమేశ్, బబ్లూ, మహేశ్ అచంట ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











