Thandel Day 3 Collections: 50 కోట్ల క్లబ్ లో యువ సామ్రాట్.. మూడో రోజు తండేల్ ఎన్ని కోట్లంటే?
Thandel Day 3 Collections: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ప్రేమ, దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు నిర్మించారు. రియల్ స్టోరీ బేస్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ సాధించి.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇంతకీ తండేల్ మూవీ ఎంత వసూలు చేసింది? బాక్సాఫీస్ వద్ద మూడవ రోజు (డే 3) ఎన్ని కోట్లు సవాళ్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
సరైన హిట్ లేక సతమతవుతున్న నాగ చైతన్య.. సక్సెస్ పుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన 'తండేల్ ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగ చైతన్య- సాయిపల్లవిల రొమాన్స్, డీఎస్పీ మ్యూజిక్, చందూ మొండేటి టేకింగ్ ఫర్పెక్ట్ గా సెట్ కావడంతో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

తండేల్ కథ విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది. ఈ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.
ఇక కర్ణాటక రైట్స్ సుమారు 3 కోట్లు, హిందీ రైట్స్ 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల టాక్ . మొత్తానికి తండేల్ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.52 కోట్ల మేర జరిగిందట. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇలా ఊహించని విధంగా రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను సుమారు 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. .
ఇక తండేల్ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఎవరూ ఊహించని విధంగా తండేల్ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు అందుకోవడం హీరో నాగ చైతన్య కెరీర్‌లో ఇదే తొలిసారి. ఇక రెండో రోజు కూడా తండేల్ అదే జోరును కొనసాగించింది. రెండో రోజు దగ్గర దగ్గర రూ.20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తండేల్ మూవీ 2 రోజుల్లో రూ.41.20కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం.
ఇక తండేల్ మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లే.. తండేల్ మూవీకి పాజిటివ్ రివ్యూలు రావడంతో వీకెండ్ లో జనాలు ఈ సినిమా హాళ్లకు బాట పడ్డాపడ్డారు. శనివారం కంటే ఆదివారం అడ్వాన్స్ బుకింగ్ పెరిగాయి. దీంతో మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ లు కూడా మరింత పెరిగాయి. ఆల్ మోస్ట్ రెండో రోజుకి ఏమాత్రం తీసిపోని విధంగా మూడో రోజు దగ్గర దగ్గర రూ.22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలా మూడు రోజుల్లో రూ.62.37 కోట్ల గ్రాస్ కు అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో తండేల్ కేవలం 3 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. ఈ జోరు చూస్తే.. త్వరలోనే బ్రేక్ ఈవెన్ గ్రాస్ చేసి.. 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











