Thandel Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద 'తండేల్' జోరు.. నాగ చైతన్య మూవీ ఎంత వసూలు చేసిందంటే?

Thandel Day 2 Expected Collections: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన "తండేల్". లవ్, యాక్షన్, దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నాగచైతన్యకి జంటగా లేడీ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి నటించింది. రియల్ లైఫ్ & లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న విడుదలైంది. ఇంతకీ తండేల్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది? బాక్సాఫీస్ వద్ద డే 2 ఎన్ని కోట్లు సవాళ్లు రాబట్టిందనే వివరాల్లోకి వెళితే..

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. తండేల్ సినిమా ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాధ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది. దాంతో ఈ సినిమాకు సెట్స్, రీసెర్చ్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడంతో ఖర్చు కూడా భారీగా జరిగింది. ఈ సినిమాను సుమారుగా రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Naga Chaitanya Sai Pallavi s latest film Thandel Day 2 expected box office collections worldwide

ఇక తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల మేర రైట్స్ బిజినెస్ వాల్యూ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ 28 కోట్ల షేర్.. సుమారుగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.

ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌కు సుమారుగా 3 కోట్లు కాగా.. హిందీ రైట్స్ 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలా ఊహించని విధంగా రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను సుమారుగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 52 కోట్ల మేర జరిగడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

గత మూడేళ్లుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న నాగ చైతన్య.. తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చిన తండేల్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. నాగ చైతన్య, సాయిపల్లవిల రొమాన్స్, డీఎస్పీ మ్యూజిక్, చందూ మొండేటి టేకింగ్ అన్ని ఇవన్నీ కూడా బాగానే వర్కౌట్ అవ్వడంతో మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది.

Naga Chaitanya Sai Pallavi s latest film Thandel Day 2 expected box office collections worldwide

మరో వైపు తండేల్‌ మూవీ కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటింది. ఎవరూ ఊహించని విధంగా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా తండేల్ నిలిచింది. అంతేకాకుండా.. ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా దుమ్ముదులిపింది. దాదాపు 4 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.3.25 కోట్లు) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అధికారంగా ప్రకటించారు. ఇలా వరల్డ్ వైడ్ గా దాదాపుగా రూ.21. 27 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు తెలిపారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్లు అందుకోంది. కానీ, తమిళ,కన్నడ, హిందీ, భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

తండేల్ మూవీ రెండు రోజు కూడా భారీ కలెక్షన్ల అందుకునే అవకాశం ఉంది. మొదటగా షో నుంచి పాజిటివ్ టాక్ ఉండటం, వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తండేల్ డే 2 శనివారం నాడు ఏపీ, నైజాంలో కనీసం 5 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 2 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1 కోటి రూపాయల గ్రాస్ తో వర్డల్ వైడ్ గా దాదాపు రూ. 10 కోట్ల వరకూ వసూళ్లు నమోదు చేస్తుందని అంచనా వేశారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య కి తండేల్ బిగ్ రిలీఫ్ ఇచ్చేట్టు ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X