Thandel Day 3 Collections: నాగ చైతన్య మాస్ జాతర.. మూడో రోజు తండేల్ మూవీకి ఎన్ని కోట్లంటే?

Thandel Day 3 Expected Collections: అక్కినేని నాగచైతన్య ( Naga Chaitanya ), సాయిపల్లవి ( Sai Pallavi ) జంటగా నటించిన సినిమా " తండేల్ " ( Thandel ). యాక్షన్, దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమాకు చందు మొండేటి (chandoo mondeti ) దర్శకత్వం వహించగా.. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ పతాకం పై బ‌న్నీ వాసు నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 7న న విడుదలైంది. ఇంతకీ తండేల్ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటివరకు ఎంత వసూలు చేసింది? బాక్సాఫీస్ వద్ద మూడవ రోజు (డే 3) ఎన్ని కోట్లు సవాళ్లు రాబట్టిందనే వివరాల్లోకి వెళితే..

గత మూడేళ్లుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న నాగ చైతన్య.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన ' తండేల్ ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లవ్, యాక్షన్, దేశభక్తి అంశాలతో రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. రియల్ లైఫ్ & లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. నాగ చైతన్య- సాయిపల్లవిల రొమాన్స్, డీఎస్పీ మ్యూజిక్, చందూ మొండేటి టేకింగ్ ఫర్పెక్ట్ గా సెట్ కావడంతో 'తండేల్ ' మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ సూప‌ర్ హిట్ గా నిలిచింది.

Naga Chaitanya Sai Pallavi s latest film Thandel Day 3 expected box office collections worldwide

తండేల్ సినిమా ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాధ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది. ఈ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.

ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌కు సుమారుగా 3 కోట్లు కాగా.. హిందీ రైట్స్ 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలా ఊహించని విధంగా రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను సుమారుగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 52 కోట్ల మేర జరిగడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

Naga Chaitanya Sai Pallavi s latest film Thandel Day 3 expected box office collections worldwide

ఇక తండేల్‌ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఎవరూ ఊహించని విధంగా తండేల్ మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో హీరో నాగ చైతన్య కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా తండేల్ నిలిచింది. ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా దుమ్ముదులిపింది. దాదాపు 4 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.3.25 కోట్లు) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అధికారంగా ప్రకటించారు. ఇలా వరల్డ్ వైడ్ గా రూ.21.27 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు తెలిపారు.

ఇక రెండో రోజు కూడా తండేల్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తండేల్ మూవీ 2 రోజుల్లో రూ.41.20కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసి కలెక్షన్స్ వెల్లడించారు. ఇక మూడో రోజు కూడా భారీ కలెక్షన్ల అందుకునే అవకాశం ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, వీకెండ్ కావడం, యూత్ నుంచి మంచి ఆదరణ రావడంతో కలెక్షన్స్ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఆదివారం నాడు ఏపీ, నైజాంలో కనీసం 6 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 2 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 1.2కోటి రూపాయల గ్రాస్ తో వర్డల్ వైడ్ గా డే 3 నాడు దాదాపు రూ. 10- 12కోట్ల వరకూ వసూళ్లు నమోదు చేస్తుందని అంచనా వేశారు. ఈ జోరు చూస్తే.. 50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X