Thandel Day 5 Collections: బాక్సాఫీస్ వద్ద చైతూ మాస్ తాండవం.. 5వ రోజు తండేల్ ఎన్ని కోట్లంటే?

Thandel Day 5 Collections: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం కు చెందిన 22 మంది మత్స్యకారుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, చేపల కోసం వెళ్లి వారు పాకిస్థాన్ అధికారులకు పట్టుబడటం, ఈ క్రమంలో వారు 14 నెలలపాటు జైలులో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అనే అంశాన్ని 'తండేల్ (Thandel )' అనే ఉద్వేగభరిత ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించగా.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించగా.. యువ నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను దూసుకపోతుంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గత మూడేండ్లుగా సరైన సక్సెస్ లేక సతమతపడుతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కించిన సినిమా తండేల్. సక్సెస్ పుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన 'తండేల్ ' మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ప్రేమ కథ, దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య-సాయిపల్లవి రొమాన్స్, దేవీ శ్రీ మ్యూజిక్, చందూ మొండేటి టేకింగ్ ఫర్పెక్ట్, అల్లు అర్జున్ ప్రొడక్షన్ వాల్యూస్ అని ఫర్పెక్ట్ గా సెట్ కావడంతో తండేల్ మూవీ తొలిఆట నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారీ మొత్తంలో కలెక్షన్లు వసూలు చేసింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Naga Chaitanya Sai Pallavi s Thandel Day 5 Box Expected Office Collections Worldwide

రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన తండేల్ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. చందూ మొండేటి- నాగ చైతన్య కాంబో రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. దీంతో తండేల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగింది. నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా రైట్స్ రూ. 16 కోట్లు, నైజాం రైట్స్ రూ. 11 కోట్లు, కర్ణాటక రైట్స్‌ రూ.3 కోట్లు, హిందీ రైట్స్ 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అమ్ముడు పోయాయని ట్రేడ్ వర్గాల టాక్ . మొత్తానికి తండేల్ సినిమా వరల్డ్ వైడ్ రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక తండేల్‌ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. ఈ సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకోవడంతో దూసుకెళ్లుంది. బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఇలా తండేల్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి, హీరో నాగ చైతన్య కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలించింది. ఇక రెండో రోజు కలెక్షన్స్ లో అదే జోరు కనిపించింది. రెండో రోజు రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక మూడో రోజు (ఆదివారం) రూ. 22 కోట్లు. ఇక నాలుగవ రోజు సోమవారం నాడు తండేల్ వసూళ్ల పర్వం కొనసాగించింది. డే 4 నాడు సుమారు 10 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇలా తండేల్ మూవీ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.73.20 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.

Naga Chaitanya Sai Pallavi s Thandel Day 5 Box Expected Office Collections Worldwide

ఇక తండేల్ 5 రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లే.. వేరే కొత్త సినిమాలు విడుదల కాకపోవడం, వర్కింగ్ డేస్ కావడంతో కలెక్షన్స్ లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ 5 డే రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ మూవీ సుమారు గా రూ. 85 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. కాస్త జోరు పెంచితే.. త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించి, రూ . 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాగ చైతన్య కెరీర్‌లో సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తున్న 'తండేల్' ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని సినీ ట్రెడ్ వర్గాలు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X