Thandel Day 7 Collections: కాస్త నెమ్మదించిన తండేల్ కలెక్షన్లు.. 7వ రోజు ఎన్ని కోట్లంటే?

Thandel Day 7 Collections: పాకిస్థాన్ జైలులో శ్రీకాకుళం మత్య్సకారుల నిజజీవిత ఘటనలను స్ఫూర్తిగా తీసుకొని 'తండేల్ (Thandel)' అనే ఎమోషనల్ లవ్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించగా.. యువ నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజైన ఈ సినిమా అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ సినిమా ఇప్పటివరకు ఆరు రోజులు పూర్తి చేసుకుని, 7వ రోజు సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

యువ సామ్రాట్ నాగ చైతన్య, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా తండేల్. రియల్ స్టోరీ ఆధారంగా సక్సెస్ పుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'తండేల్' మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో ఆడుకాలం నరేన్, ప్రకాశ్ బెలవాది, కరుణాకరన్, చరణ్‍దీప్, బబ్లూ పృథ్విరాజ్, కల్పలతలు కీ రోల్స్ ల్లో నటించారు. రియల్ స్టోరీ ఆధారంగా నిర్మించిన తెరకెక్కిన ఈ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Naga Chaitanya Sai Pallavi s Thandel Day 7 Box Expected Office Collections Worldwide

చందూ మొండేటి- నాగ చైతన్య కాంబో రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో తండేల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరిగింది. నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా రైట్స్ రూ. 16 కోట్లు, నైజాం రైట్స్ రూ.11 కోట్లు, కర్ణాటక రైట్స్‌ రూ.3 కోట్లు, హిందీ రైట్స్ రూ. 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇలా తండేల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక తండేల్‌ కలెక్షన్లు చూస్తే.. నాగ చైతన్య-సాయిపల్లవి రొమాన్స్, దేవీ శ్రీ మ్యూజిక్, చందూ మొండేటి టేకింగ్ ఫర్పెక్ట్, అల్లు అర్జున్ ప్రొడక్షన్ వాల్యూస్ అని ఫర్పెక్ట్ గా సెట్ కావడంతో తండేల్ మూవీ ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. దీంతో తండేల్ తొలిరోజు వర్డల్ వైడ్ గా రూ.21.27 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.20 కోట్లు, మూడో రోజు రూ. 22 కోట్ల గ్రాస్, 4వ రోజు రూ. 10.4 కోట్లు, 5 రోజు రూ.7 కోట్లు, ఆరవ రోజు రూ. రోజు రూ.5 కోట్లు వసూలు చేసింది. దీంతో తండేల్ మూవీ 6 రోజుల్లో సుమారు గా రూ. 86 కోట్ల గ్రాస్ వచ్చిందని మూవీ మేకర్స్ ప్రకటించారు.

Naga Chaitanya Sai Pallavi s Thandel Day 7 Box Expected Office Collections Worldwide

ఇక 7 వ రోజు కలెక్షన్ల ( Thandel Day 7 Expected Collections) వివరాల్లోకెళ్తే.. బుధవారంతో పోలిస్తే.. గురువారం వసూలు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ ఆ రోజు రూ. 4.5 కోట్ల గ్రాస్ నమోదు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ మూవీ సుమారు గా రూ. 92 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో పలు చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించినట్టు తెలుస్తోంది. అయితే.. మూవీ మేకర్స్ ప్రకటించినట్టుగా వంద కోట్లు టార్గెట్ ఈ వారాంతం దాటుతుందో లేదో వేచి చూడాలి. ఇక కొత్త చిత్రాల ఊపు కనిపిస్తే తండేల్ హవా కాస్త తగ్గే అవకాశం లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X