Thandel Day 4 Collections: దుమ్మురేపుతున్న యువ సామ్రాట్.. 4వ రోజు తండేల్ ఎన్ని కోట్లంటే?

Thandel Collections: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ఏపీలో శ్రీకాకుళంలోని 22 మంది మత్స్యకారుల జీవితాల్లో జరిగిన ఘటనలు, వారు పాకిస్థాన్ అధికారులకు పట్టుబడి, 14 నెలలపాటు జైలులో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అనే విషయాన్ని ఓ ఉద్వేగ భరిత ప్రేమకథా గా తెరకెక్కించారు. అదే ఈ తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించగా.. యువ నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను దూసుకపోతుంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గత మూడేండ్లుగా సరైన విజయంగా లేక సతమతవుతున్న నాగ చైతన్య.. సక్సెస్ పుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంతో రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన 'తండేల్ ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ప్రేమ కథ, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగ చైతన్య- సాయిపల్లవి రొమాన్స్, దేవీ శ్రీ మ్యూజిక్, చందూ మొండేటి టేకింగ్ ఫర్పెక్ట్ గా సెట్ కావడంతో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Naga Chaitanya Sai Pallavi s Thandel Day 4 Box Office Collections Worldwide towards 100 Crores

ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తండేల్ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 16 కోట్లు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారు రూ. 11 కోట్లు, కర్ణాటక రైట్స్‌ రూ. 3 కోట్లు, హిందీ రైట్స్ 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల టాక్ . మొత్తానికి తండేల్ సినిమా వరల్డ్ వైడ్ రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇక తండేల్‌ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు అందుకోవడం హీరో నాగ చైతన్య కెరీర్‌లో ఇదే తొలిసారి. ఇక రెండో రోజు కూడా తండేల్‌ అదే జోరును కొనసాగించింది. రెండో రోజు దగ్గర దగ్గర రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. 2 రోజుల్లో తండేల్ మూవీ రూ.41.20కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక మూడో కలెక్షన్లు మరింత పెరిగాయి. ఆదివారం నాడు రూ.22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో తండేల్ మూవీ మూడు రోజుల్లో రూ.62.37 కోట్ల గ్రాస్ కు అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఇక తండేల్ 4 రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లే.. గత 3 రోజులు వీకెండ్, వేరే కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో భారీ మొత్తంలో కలెక్షన్లు వసూలు చేసింది. ఇక వర్కింగ్ డేస్ ప్రారంభం కావడంతో కలెక్షన్స్ లో కాస్త తగ్గుదల కనిపించింది. చెప్పుకోదగ్గ విధంగానే తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ 4 డే నాడు రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ మూవీ సూమరుగా రూ. 80 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. కాస్త జోరు పెంచితే.. త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించి, రూ . 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X