Thandel Day 5 Collections: తగ్గేదేలే అంటున్న నాగ చైతన్య.. 5వ రోజు తండేల్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
Thandel Day 5 Collections: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంకు చెందిన 22 మంది మత్స్యకారుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, వారు చేపల కోసం వెళ్లి పాకిస్థాన్ నేవీకి పట్టుబడటం, 14 నెలల పాటు జైలుశిక్ష అనుభవించడమనే అంశాన్ని'తండేల్ (Thandel)' అనే ఓ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ ప్రేమ, దేశభక్తి సినిమాకు యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించగా.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించగా.. యువ నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకపోతుంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యువ సామ్రాట్ నాగ చైతన్య, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి జంటగా తెరకెక్కించిన సినిమా తండేల్. రియల్ స్టోరీ ఆధారంగా సక్సెస్ పుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'తండేల్' మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో నాగ చైతన్య-సాయిపల్లవి రొమాన్స్, దేవీ శ్రీ మ్యూజిక్, చందూ మొండేటి టేకింగ్ ఫర్పెక్ట్, అల్లు అర్జున్ ప్రొడక్షన్ వాల్యూస్ అని ఫర్పెక్ట్ గా సెట్ కావడంతో తండేల్ మూవీ ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారీ మొత్తంలో కలెక్షన్లు వసూలు చేసింది. దీంతో నాగ చైతన్య మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

తండేల్ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. చందూ మొండేటి- నాగ చైతన్య కాంబో రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో తండేల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగింది. నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా రైట్స్ రూ. 16 కోట్లు, నైజాం రైట్స్ రూ. 11 కోట్లు, కర్ణాటక రైట్స్ రూ.3 కోట్లు, హిందీ రైట్స్ 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అమ్ముడు పోయాయని ట్రేడ్ వర్గాల టాక్ . మొత్తానికి తండేల్ సినిమా వరల్డ్ వైడ్ రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక తండేల్ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. నాగచైతన్య సినిమాకు ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో తండేల్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి, హీరో నాగ చైతన్య కెరీర్‌లో తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా నిలించినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. రెండో రోజు రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ఇక మూడో రోజు (ఆదివారం) రూ. 22 కోట్లు వసులు చేసినట్టు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఇక నాలుగవ రోజు (సోమవారం) తండేల్ వసూళ్ల పర్వం కొనసాగించింది. వర్కింగ్ డే అయినా డే 4 నాడు రూ. 10.4 కోట్లు వసూలు చేసింది. ఇలా తండేల్ మూవీ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.73.20 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక తండేల్ 5 రోజు కలెక్షన్ల వివరాల్లోకెళ్లే.. వర్కింగ్ డేస్ అయినా సాలిడ్ కలెక్షన్స్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 4.5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ ఐదో రోజు రూ.6.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ సుమారు గా రూ. 80 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనీ,కాస్త జోరు పెంచితే రూ. 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాగ చైతన్య కెరీర్‌లో సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తున్న 'తండేల్' ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











