Thandel Day 7 Collections: ‘తండేల్’ ఏడోరోజు కలెక్షన్లు.. వారంలో ఎంత వసూలైందంటే?

అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించి లేటెస్ట్ ఫిల్మ్ 'తండేల్'. ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చైతూ కెరీర్ లో ఈ చిత్రాన్ని ఉత్తమమని ఆడియెన్స్ చెబుతున్న విషయం కూడా విధితమే. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్న చైతూ 'తండేల్' చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కూడా స్టడీగానే వసూళ్లు రాబడుతోంది. మరోవైపు విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం, లైలా, బ్రహ్మానందం, న్యూ రిలీజెస్ ఉన్నప్పటికీ తండేల్ మాత్రం తన వసూళ్లు తనవే అన్న పంథాలో వసూళ్లు చేస్తూనే వస్తోంది.

ఆరో రోజు తండేల్ చిత్రానికి రూ.5 కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ అందింది. కేవలం తెలుగు స్టేట్స్, కన్నలో కలిపి రూ.3.5 కోట్లు సాధించడం విశేషం. చైతూ గత సినిమాలతో పోల్చితే ఈ చిత్రం వారం రోజుల వరకూ స్టడీగానే వసూళ్లను రాబడుతోంది. ఇక.. 'తండేల్' ఏడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలకొస్తే.. ఆరో రోజు తో పోల్చితే.. ఏడో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లను కొనసాగిస్తోంది. వర్కింగ్ డేస్ లోనూ వసూళ్లు రాబడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇక తెలుగు స్టేట్స్, ఇతర ఏరియాల నుంచి టోటల్ గా ఏడోరోజు ఇండియాలో రూ.1.85 కోట్ల నెట్ వసూల్ చేసింది.

Naga Chaitanya Sai Pallavi Thandel Day 7 Box Office Collections Worldwide

దీంతో వారం రోజుల్లో తండేల్ ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.47.95 కోట్ల నెట్ ను వసూల్ చేసింది. ఏడో రోజుతో రూ.40 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది. మొదటి వారంలోనే 'తండేల్' 80శాతం వరకు వసూళ్లను తిరిగి రాబట్టగలిగింది. 75 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి.. రూ.105 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయ్యింది. ఈ లెక్కన 54 కోట్ల షేర్ వసూల్ చేయాల్సి ఉంటుంది. దీంతో రెండో వారంలో కూడా తండేల్ ఇలానే వసూళ్లు రాబట్ట గలిగితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను త్వరలోనే పూర్తి చేసుకుంటుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండో వారంలో బాక్సాఫీస్ వద్ద ఉన్న పోటీని తట్టుకొని నిలబడగలిగితే మాత్రం సెకండ్ వీక్ లో రూ.100 కోట్ల గ్రాస్ తప్పనిసరి అని అంటున్నారు. చూడలి మరీ సెకండ్ వీక్ 'తండేల్' ఎలా పెర్ఫామ్ చేస్తుందనేది.

ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఆంధ్రాలో రూ.16కోట్లు, నైజాంలో రూ.11 కోట్లు, కర్ణాటకలో రూ.3 కోట్లు, హిందీ రైట్స్ ను రూ.10 కోట్లకు కొనుగోలు అయ్యింది. ఓవర్సీస్ రైట్స్ రూ.12కోట్ల వరకు అమ్ముడుపోయిందని ట్రెడ్ వర్గాల నుంచి సమాచారం. ఇక చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగచైతన్య శ్రీకాకుళం రాజుగా జీవించారు. మరోవైపు సాయిపల్లవి సత్య పాత్రలో నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తి మిళితమైన ఈ చిత్రాన్ని ఆడియెన్స్ కూడా ఆదరిస్తున్నారు. చైతన్య కెరీర్ లోనే ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుండటంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X