Thandel Day 6 Collections: రూ.100 కోట్లకు మరింత చేరువలో తండేల్.. 6వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

Thandel Day 6 Collections: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంకు చెందిన 22 మంది మత్స్యకారుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, వారు పాకిస్థాన్ జైలులో కొన్ని నెలలు ఉంటడం వంటి ఘటనలను స్ఫూర్తిగా తీసుకొని 'తండేల్ (Thandel)' అనే ఎమోషనల్ లవ్ ని మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించగా యువ నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7వ తేదీన రిలీజైన ఈ సినిమా అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ సినిమా 6వ రోజు సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో తండేల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

యువ సామ్రాట్ నాగ చైతన్య, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా తండేల్. రియల్ స్టోరీ ఆధారంగా సక్సెస్ పుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'తండేల్' మూవీకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రంలో ఆడుకాలం నరేన్, ప్రకాశ్ బెలవాది, కరుణాకరన్, చరణ్‍దీప్, బబ్లూ పృథ్విరాజ్, కల్పలత ప్రధాన పాత్రల్లో పోషించారు. రియల్ స్టోరీ ఆధారంగా నిర్మించిన తెరకెక్కిన ఈ సినిమాను దాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Naga Chaitanya Sai Pallavi s Thandel Day 6 Box Office Collections Worldwide

చందూ మొండేటి- నాగ చైతన్య కాంబో రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో తండేల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరిగింది. నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా రైట్స్ రూ. 16 కోట్లు, నైజాం రైట్స్ రూ.11 కోట్లు, కర్ణాటక రైట్స్‌ రూ.3 కోట్లు, హిందీ రైట్స్ రూ. 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాల టాక్ . ఇలా తండేల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

భారీ అంచాలతో విడుదలైన తండేల్ సినిమా అనుకున్నట్లుగా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ సినిమాలో నాగ చైతన్య - సాయిపల్లవి రొమాన్స్, దేవీ శ్రీ మ్యూజిక్, చందూ మొండేటి టేకింగ్ ఫర్పెక్ట్, అల్లు అర్జున్ ప్రొడక్షన్ వాల్యూస్ అని సరిపాళ్లలో ఉండటంతో తండేల్ మూవీ ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సూపర్ ఓపెనింగ్ అందుకున్న ఈ చిత్రం వీక్‍డే స్‍లోనూ కలెక్షన్లపై పట్టు సాధించింది. అలాగే.. వర్కింగ్ డేస్ కూడా స్టడీగా కలెక్షన్లను రాబడుతోంది. భారీ మొత్తంలో కలెక్షన్లు వసూలు చేసింది.

Naga Chaitanya Sai Pallavi s Thandel Day 6 Box Office Collections Worldwide

ఇక తండేల్‌ మూవీ కలెక్షన్ల వివరాల్లోకెళ్తే.. సినిమా ఫస్ట్ డే పాజిటివ్ టాక్‌ రావడంతో ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు చేస్తుంది. ఈ క్రమంలో తండేల్ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ చేసి.. యువ సామ్రాట్ నాగ చైతన్య కెరీర్‌లో తొలిరోజు అత్యధిక వసూలు రాబట్టిన సినమాగా నిలిచింది. ఇక రెండో రోజు రూ.20 కోట్లు, మూడో రోజు (ఆదివారం) రూ. 22 కోట్లు వసులు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక నాలుగవ రోజు కూడా తండేల్ వసూళ్ల పర్వం కొనసాగించింది. వర్కింగ్ డే అయినా రూ. 10.4 కోట్లు వసూలు చేసింది. ఇక 5 వ రోజురూ.6.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఆరవ రోజు తండేల్ మూవీ కలెక్షన్ల (Thandel Day 6 Collections) వివరాల్లోకెళ్తే.. 5 వ రోజుతో పోలిస్తే ఆరవ రోజు వసూళ్లు స్టడీగా ఉన్నట్టు అర్థమవుతోంది. సినిమా మంచి ఆక్యుపెన్సీ సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కన్నడలో కలిపి రూ. 3.5 కోట్లు, ఓవర్సీస్‌తో కలిపి తండేల్ మూవీ ఆరో రోజు రూ.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ మూవీ సుమారు రూ. 85.2 కోట్ల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ వీకెండ్ లో తండేల్ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి, రూ.100కోట్ల మార్క్ దాటుతుందని మూవీ టీం ప్రకటించారు. ప్రస్తుతం కలెక్షన్ల తీరు గమనిస్తే.. ఈ వారాంతంలో తండేల్ రూ 100 కోట్ల మార్క్ దాటే అవకాశముంది. ఫిబ్రవరి 14న లైలా, బ్రహ్మా ఆనందం వచ్చినా తండేల్‍ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ అంతగా ఉండకోవచ్చుననీ, ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ వస్తుందని మూవీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X