బాక్స్‌ఫీస్‌ను కుమ్మేస్తున్న మజిలీ.. చైతూ కెరీర్‌లోనే రికార్డు.. లాభాల్లోకి రావాలంటే?
నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత అక్కినేని జంటగా నటించిన మజిలీ వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లను వసూలు చేయడం ట్రెడ్ వర్గాల్లో జోష్ పెరిగింది. ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్‌కు నచ్చే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం గత మూడు రోజులు బ్రహ్మండమైన కలెక్షన్లు సాధించింది. ఆ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే...

మూడు రోజుల్లో భారీగా
ప్రపంచవ్యాప్తంగా మజిలీ చిత్రం గత మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 32 కోట్ల రూపాయల గ్రాస్, 17.32 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. తొలి రోజున ఈ చిత్రం రూ.11.5 కోట్ల గ్రాస్ (7 కోట్లు నికరం) వసూలు చేసింది. మూడో రోజు ఆదివారం ఈ చిత్రం రూ.4 కోట్లకుపైగా రాబట్టింది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా వెల్లడించారు.

నైజాంలో రికార్డు వసూళ్లు
నైజాంలో మజిలీ భారీ వసూళ్లను సాధించింది. ఉగాది పండుగ సెలవుల కారణంగా మొదటి రోజున రూ.2.11 కోట్లు, 2 రోజున రూ.2.04 కోట్లు, మూడో రోజున రూ.1.76 కోట్ల వసూలు చేసింది. గత మూడు రోజుల్లో నైజాంలోనే రూ.5.91 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఈ వసూళ్లు చైతూ కెరీర్‌లో ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు.

ఏపీ, సీడెడ్‌లో మజిలీ
మూడో రోజున సీడెడ్‌లో రూ.46 లక్షలు, నెల్లూరులో రూ.9.54 లక్షలు, గుంటూరులో రూ.25 లక్షలు, కృష్ణాలో రూ.28 లక్షలు, పశ్చిమలో రూ.16 లక్షలు, తూర్పులో రూ.54 లక్షలు వసూలు చేసింది. ఇక కర్ణాటకలో రూ.7 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో రూ.14 లక్షలు సాధించింది. మూడో రోజున మొత్తంగా తెలంగాణ, ఆంధ్రాలో కలిపి రూ.3.64 కోట్లు రాబట్టింది.

హైదరాబాద్ క్రాస్ రోడ్డులో
హైదరాబాద్ క్రాస్ రోడ్డులో మజిలీకి మంచి స్పందన లభిస్తున్నది. తొలి రోజున రూ.7.5 లక్షలు, రెండో రోజున రూ.7 లక్షలు, మూడో రోజున 7 లక్షలు సాధించింది. మొత్తంగా రూ.21 లక్షలు ఆర్టీసీ క్రాస్ రోడ్డు రావడం సినిమా ఆదరణను చాటిచెప్పింది.

70 శాతం రికవరీ సాధింపు
మజిలీ థియేట్రికల్ రైట్స్‌ను రూ.22 కోట్లకు అమ్మడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 70 శాతం రికవరీని సాధించింది. క్రికెటర్ జీవితంలో చోటు చేసుకొన్న ప్రేమ, వైఫల్యాలు, కుటుంబ పరిస్థితుల ఆధారంగా మజిలీ తెరకెక్కింది. నాగచైతన్య ప్రేయసిగా నటించిన దివ్యాంశ కౌశిక్ తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. సమంత నటన హైలెట్‌గా మారింది.


Click it and Unblock the Notifications











