Custody 2 Days Collections: కస్టడీకి షాకింగ్ వసూళ్లు.. హాలీడే ఉన్నా ఇంతే.. రావాల్సింది అన్ని కోట్లా!

టాలీవుడ్‌లో వేగంగా సినిమాలు చేస్తూ కనీసం ఏడాదికి రెండు చిత్రాలతోనైనా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగిపోతోన్నాడు యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఆ మధ్య హ్యాట్రిక్ విజయాలను అందుకున్న అతడు.. గత ఏడాది వరుస దెబ్బలను తిన్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సాధించాలన్న పట్టుదలతో తాజాగా 'కస్టడీ' అనే ద్విభాషా చిత్రంతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్‌పై ప్రభావం పడింది. రెండో రోజు కూడా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 'కస్టడీ' 2 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

'కస్టడీ' అంటూ వచ్చిన చైతూ: అక్కినేని నాగ చైతన్య - వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందిన థ్రిల్లర్ సినిమానే 'కస్టడీ'. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చారు.

Custody 2 Days Collections

కస్టడీ మూవీ బిజినెస్ వివరాలివే: అక్కినేని నాగ చైతన్య 'కస్టడీ' మూవీకి నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.25 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా : 'కస్టడీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజు తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 27 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి.. రూ. 80 లక్షలు షేర్, రూ. 1.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

Custody 2 Days Collections

2 రోజులకూ కలిపి ఎంతొచ్చింది: 'కస్టడీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2 తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.03 కోట్లు, సీడెడ్‌లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 31 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 28 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి.. రూ. 2.62 కోట్లు షేర్, రూ. 4.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఆంధ్రా, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 2.62 కోట్లు రాబట్టిన నాగ చైతన్య 'కస్టడీ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 11 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 80 లక్షలు, తమిళ వెర్షన్‌కు రూ. 15 లక్షలు వచ్చాయి. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో రూ. 3.68 కోట్లు షేర్‌, రూ. 7.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Custody 2 Days Collections

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి? : క్రేజీ కాంబోలో వచ్చిన 'కస్టడీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 3.68 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 21.32 కోట్లు రాబడితేనే నాగ చైతన్య మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

హాలీడే ఉన్నా ఇంత తక్కువగా : తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'కస్టడీ' మూవీకి అనుకున్న దానికంటే మొదటి రోజు చాలా తక్కువ స్పందన వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ అంతగా రాలేదు. దీనికితోడు రెండో రోజు సెకెండ్ శాటర్‌డే హాలీడే ఉన్నా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయల షేర్ కూడా వసూలు కాలేదు. ఇదే కంటిన్యూ అయితే ఈ సినిమాకు కోట్లలో నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X