Custody 3 Days Collections: సండే ఘోరమైన వసూళ్లు.. 3 రోజుల్లో ఇంత తక్కువ.. అది జరిగితేనే చైతూకు హిట్
టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా సందడి చేస్తుండడమే. అందులో యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోన్నాడు. అంతలా అతడు తనదైన చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు చైతూ 'కస్టడీ' అనే సినిమాను చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లు పెద్దగా రావట్లేదు. ఆదివారం కూడా నిరాశనే ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో 'కస్టడీ' 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!
ద్విభాషా చిత్రంతో వచ్చిన చైతూ:అక్కినేని నాగ చైతన్య హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందించిన సినిమానే 'కస్టడీ'. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.

కస్టడీ మూవీ బిజినెస్ వివరాలివే:నాగ చైతన్య నటించిన 'కస్టడీ' మూవీకి నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.25 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్ల బిజినెస్ చేసుకుంది.

3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా:
'కస్టడీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజు రెస్పాన్స్ మరింత తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 78 లక్షలు షేర్, రూ. 1.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
3 రోజులకూ కలిపి ఎంతొచ్చింది: 'కస్టడీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 3 రోజుల్లో తక్కువ స్పందనే దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 1.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో కలిపి.. రూ. 3.40 కోట్లు షేర్, రూ. 6.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: 3 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 3.40 కోట్లు రాబట్టిన నాగ చైతన్య 'కస్టడీ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.00, తమిళ వెర్షన్‌కు రూ. 23 లక్షలు వచ్చాయి. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో రూ. 4.83 కోట్లు షేర్, రూ. 10.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?: స్టార్ కాంబోలో రూపొందిన 'కస్టడీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 4.83 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 20.17 కోట్లు రాబడితేనే నాగ చైతన్య మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

వీకెండ్‌లో మరీ దారుణంగానే: నాగ చైతన్య - కృతి శెట్టి జంటగా నటించిన 'కస్టడీ' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి. ఇక, రెండు, మూడు రోజులు హాలీడేలు ఉన్నా కూడా ఈ సినిమా అంతగా రాణించలేకపోయింది. ఫలితంగా నాగ చైతన్య చిత్రం వీకెండ్‌లో నిరాశ పరిచే కలెక్షన్లనే ఖాతాలో వేసుకుంది. మరి వీక్ డేస్‌లో ఏం చేస్తుందో!


Click it and Unblock the Notifications











