Custody 4 Days Collections: సోమవారం మరింత దారుణంగా.. ఇక ఆ స్థాయిలో నష్టాలు తప్పేలా లేవు?
అక్కినేని హీరో నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద కస్టడీ సినిమాతో మరో డిజాస్టర్ ఎదుర్కొబోతున్నాడు. ఇప్పటికే అతను థాంక్యూ సినిమాతో ఊహించిన విధంగా ఫ్లాప్ చూశాడు. అయితే ఇప్పుడు కస్టడీ సినిమా కూడా దాదాపు అదే స్థాయిలో నష్టాలు కలిగించేలా కనిపిస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దా మొదటి వీకెండ్ లో ఏమంతగా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ అయితే తీసుకురాలేదు. ఇక సోమవారం కూడా పరిస్థితి మరింత దారుణంగా కనిపించింది. ఇక మొత్తంగా కస్టడీ సినిమా నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది.. అనే వివరాల్లోకి వెళితే..
కస్టడీ సినిమా బిజినెస్ :నాగ చైతన్య నటించిన 'కస్టడీ' సినిమా నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.25 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్ల బిజినెస్ చేసుకుంది.

4వ రోజు ఏపి నైజాం కలెక్షన్స్:'కస్టడీ' సినిమా ఆంధ్రా, తెలంగాణలో 4వ రోజు రెస్పాన్స్ మరింత తగ్గింది. ఇక నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో కలిపి.. రూ. 78 లక్షలు షేర్, రూ. 1.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

4 రోజులకు నైజాం ఏపీ టోటల్:'కస్టడీ' సినిమా ఆంధ్రా, తెలంగాణలో 4 రోజుల్లో తక్కువ స్పందనే దక్కింది. ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 1.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 41 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 29 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో కలిపి.. రూ. 3.90 కోట్లు షేర్, రూ. 6.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా..:4 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 3.90 కోట్లు రాబట్టిన నాగ చైతన్య 'కస్టడీ' సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా ఆశించినంత స్థాయిలో అయితే కలెక్షన్స్ అందుకోలేదు. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.00, తమిళ వెర్షన్‌కు రూ. 23 లక్షలు వచ్చాయి. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో రూ. 5.60 కోట్లు షేర్, రూ. 10.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

సినిమా టార్గెట్.. మొత్తం ఎంత రావాలి?:స్టార్ కాంబోలో రూపొందిన 'కస్టడీ' సినిమా అంచనాలకు తగ్గట్టు ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదు కాగా. 3 రోజుల్లో దీనికి రూ. 4.83 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 20.17 కోట్లు రాబడితేనే నాగ చైతన్య మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఫైనల్ గా సినిమా దాదాపు 18 కోట్ల రేంజ్ లో నష్టాలు కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











