Custody 5 Days Collections: నాగ చైతన్యకు బిగ్ షాక్.. 5రోజుల్లో ఇంత ఘోరమా.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఆ మధ్య వరుస హిట్లు కొట్టిన అతడు.. గత ఏడాది రెండు డిజాస్టర్లతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'కస్టడీ' అనే సినిమాను చేశాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి రెస్పాన్స్ సరిగా లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రావట్లేదు. ఈ నేపథ్యంలో 'కస్టడీ' 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!
కస్టడీ అంటూ వచ్చేసిన చైతూ:యువసామ్రాట్ నాగ చైతన్య హీరోగా.. వెంకట్ ప్రభు తెరకెక్కించిన యాక్షన్ సినిమానే 'కస్టడీ'. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.

కస్టడీ మూవీ బిజినెస్ వివరాలివే:అక్కినేని నాగ చైతన్య 'కస్టడీ' మూవీకి నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.25 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

5వ రోజు ఎంత వసూలు చేసింది:'కస్టడీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5వ రోజు రెస్పాన్స్ మరింత తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 37 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

5 రోజులకూ కలిపి ఎంతొచ్చింది:5 రోజుల్లో 'కస్టడీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో తక్కువ స్పందనే దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 1.49 కోట్లు, సీడెడ్‌లో రూ. 51 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 53 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 43 లక్షలు, కృష్ణాలో రూ. 36 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలతో కలిపి.. రూ. 4.17 కోట్లు షేర్, రూ. 7.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఆంధ్రా, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 4.17 కోట్లు రాబట్టిన నాగ చైతన్య 'కస్టడీ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 27 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.09 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 30 లక్షలు వచ్చాయి. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 5.83 కోట్లు షేర్, రూ. 12.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?:క్రేజీ కాంబోలో విడుదలైన 'కస్టడీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 5.83 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 19.17 కోట్లు రాబడితేనే నాగ చైతన్య మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











