Custody Closing Collections: కస్టడీ 25 కోట్ల టార్గెట్.. నాగచైతన్య మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో అక్కినేని నాగ చైతన్య ఒకడు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చిన అతడు.. కష్టపడేతత్వంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. దీనికితోడు కొన్ని విజయాలను కూడా సొంతం చేసుకుని స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. అయితే, ఈ మధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న చైతన్య.. ఇటీవలే 'కస్టడీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, దీనికి ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టోటల్ కలెక్షన్ల రిపోర్టును మీరే చూడండి!

కస్టడీ అంటూ చైతన్య ఎంటర్:అక్కినేని నాగ చైతన్య - వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ సినిమానే 'కస్టడీ'. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.

 Naga Chaitanya Starrer Custody Movie Closing Worldwide Official Collections

కస్టడీ మూవీ బిజినెస్ వివరాలివే:యువసామ్రాట్ నాగ చైతన్య 'కస్టడీ' మూవీకి నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.25 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్ల బిజినెస్ చేసుకుంది.

 Naga Chaitanya Starrer Custody Movie Closing Worldwide Official Collections

అలాంటి టాక్.. వసూళ్లు తక్కువ:అక్కినేని నాగ చైతన్య - కృతి శెట్టి జంటగా నటించిన 'కస్టడీ' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే వసూళ్లు ఆశించిన రీతిలో రావట్లేదు. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల లోపే చాలా చోట్ల రన్‌ను కూడా ముగించేసింది. అదే సీన్ ప్రపంచ వ్యాప్తంగానూ కనిపించింది. దీంతో నాగ చైతన్య ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లైంది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా:6 రోజులకే చాలా చోట్ల రన్ ముగించిన 'కస్టడీ'కి తెలుగులో షాక్ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 1.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 59 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 39 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో కలిపి.. రూ. 4.47 కోట్లు షేర్, రూ. 8.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

 Naga Chaitanya Starrer Custody Movie Closing Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఆంధ్రా, తెలంగాణలో ఇప్పటి వరకూ రూ. 4.47 కోట్లు రాబట్టిన నాగ చైతన్య 'కస్టడీ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 28 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.13 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 32 లక్షలు వచ్చాయి. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.20 కోట్లు షేర్‌, రూ. 13.40 కోట్లు గ్రాస్ వసూలైంది.

 Naga Chaitanya Starrer Custody Movie Closing Worldwide Official Collections

తమిళ వెర్షన్ పరిస్థితి ఘోరమే:అక్కినేని నాగ చైతన్య నటించిన 'కస్టడీ' మూవీ తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైంది. ఇక్కడ అంతంత మాత్రం అయినా కలెక్షన్లను వసూలు చేసిన ఈ చిత్రం.. కోలీవుడ్‌లో మాత్రం దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఫలితంగా అక్కడ కూడా చాలా తక్కువ కలెక్షన్లనే రాబట్టింది. దీంతో రూ. 2.50 కోట్లు టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ మూవీ.. 2 కోట్లు పైగా నష్టాలనే ఎదుర్కొంది.

 Naga Chaitanya Starrer Custody Movie Closing Worldwide Official Collections

మూవీకి టార్గెట్.. నష్టం ఎంత?:యాక్షన్ స్టోరీతో వచ్చిన 'కస్టడీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, ఇప్పటి వరకూ దీనికి రూ. 6.20 కోట్లు వచ్చాయి. అంటే.. ఈ సినిమాకు ఓవరాల్‌గా రూ. 18.80 కోట్లు వరకూ నష్టాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X