Custody Day 1 Collections: కస్టడీకి ఊహించని వసూళ్లు.. తొలి రోజే ఈ రేంజ్‌లోనా.. ఆ మూవీ కంటే ఎక్కువే!

స్టార్ హీరో కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. నిరంతరం కష్టపడుతూ తనకంటూ మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. కెరీర్ ఆరంభం నుంచీ తనలోని నటనను మెరుగుపరుచుకుంటూ వస్తోన్న అతడు.. ఎన్నో హిట్లను కూడా అందుకున్నాడు. అయితే, ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్నాడు. ఈ పరిస్థితుల్లో తాజాగా చైతూ 'కస్టడీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు ఎలాంటి వసూళ్లు వచ్చాయి? అనే వివరాలను చూద్దాం పదండి!

'కస్టడీ'తో చైతూ మరో ప్రయోగం: అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా సినిమానే 'కస్టడీ'. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా.. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని ఇచ్చారు.

 Custody Day 1 Collections

కస్టడీ మూవీ బిజినెస్ వివరాలివే: నాగ చైతన్య నటించిన 'కస్టడీ' మూవీకి నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.20 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్ల బిజినెస్ చేసుకుంది.

అలాంటి టాక్.. కలెక్షన్లు మాత్రం: ఎన్నో అంచనాల నడుమ విడుదలైన నాగ చైతన్య 'కస్టడీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ఆశించిన రీతిలో రెస్పాన్స్ మాత్రం దక్కలేదు. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన తక్కువ కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకారమే కస్టడీకి వసూళ్లు దక్కాయి.

 Custody Day 1 Collections:

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది : 'కస్టడీ' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 76 లక్షలు, సీడెడ్‌లో రూ. 23 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 22 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 12 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో కలిపి.. రూ. 1.82 కోట్లు షేర్, రూ. 3.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది : ఆంధ్రా, తెలంగాణలో తక్కువగా రూ. 1.82 కోట్లు రాబట్టిన నాగ చైతన్య 'కస్టడీ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశ పరిచిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 60 లక్షలు, తమిళ వెర్షన్‌కు రూ. 12 లక్షలు వచ్చాయి. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 2.62 కోట్లు షేర్‌, రూ. 4.85 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇక, హైర్స్, జీఎస్టీ లేకుండా అయితే ఇది రూ. 3.90 కోట్లు షేర్, రూ. 7.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

custody

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి : క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన 'కస్టడీ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.05 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 2.62 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 22.38 కోట్లు రాబడితేనే నాగ చైతన్య మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

custody

డిజాస్టర్ మూవీ కంటే ఎక్కువ : క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'కస్టడీ' మూవీకి అనుకున్న దానికంటే తక్కువ రెస్పాన్సే వచ్చింది. దీంతో ఈ చిత్రం మొదటి రోజే చాలా తక్కువగా రూ. 2.62 కోట్లు వసూలు చేసింది. ఇది చాలా దారుణం అనే చెప్పాలి. అయితే, నాగ చైతన్య గత చిత్రం 'థ్యాంక్యూ' కంటే ఇది ఎక్కువ వసూళ్లనే రాబట్టింది. దానికి అయితే మొదటి రోజు రూ. 2.16 కోట్లే కలెక్ట్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X