Thank You 10 Days Collections: సండే కూడా చైతూకు షాక్.. 10వ రోజే ఇలానా.. హిట్‌కు అన్ని కోట్ల దూరంలో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది వారసులు స్టార్లుగా వెలుగొందుతోన్నారు. తద్వారా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ తమదైన చిత్రాలతో అలరిస్తున్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కుమారుడు యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన అతడు.. హిట్లు ఫ్లాపులతో కెరీర్‌ను సమాంతరంగా తీసుకు వెళ్తున్నాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు.

ఈ ఉత్సాహంతోనే ఇటీవలే 'థ్యాంక్యూ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదు. దీంతో కలెక్షన్లు పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' 10 రోజుల రిపోర్టును మీరే చూడండి!

థ్యాంక్యూ మూవీతో వచ్చిన చైతూ

థ్యాంక్యూ మూవీతో వచ్చిన చైతూ

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ తీసిన సినిమానే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందించాడు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు.

 థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్

నాగ చైతన్య మార్కెట్‌ను బట్టి 'థ్యాంక్యూ' మూవీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

10వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది?

10వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది?

టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన 'థ్యాంక్యూ' మూవీ భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో 10వ రోజు ఈ చిత్రానికి రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 8 లక్షలే వచ్చాయి.

10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

10 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

ఏపీ, తెలంగాణలో 'థ్యాంక్యూ' మూవీకి 10 రోజుల్లో చాలా తక్కువ కలెక్షన్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.29 కోట్లు, సీడెడ్‌లో రూ. 42 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో.. రూ. 3.45 కోట్లు షేర్, రూ. 6.00 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 3.45 కోట్లు షేర్ రాబట్టిన 'థ్యాంక్యూ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.02 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాగ చైతన్య సినిమాకు రూ. 4.54 షేర్‌తో పాటు రూ. 8.30 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన 'థ్యాంక్యూ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 4.54 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సినిమా విజయం సాధించేందుకు మరో రూ 20.44 కోట్లు దూరంలోనే ఉండిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X