For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thank You 1st Week Collections: 25 కోట్లు బిజినెస్.. వారంలో షాకింగ్‌గా.. అదే జరిగితే కోట్ల నష్టాలు

    |

    ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కిడ్స్ హీరోలుగా సందడి చేస్తున్నారు. అందులో అక్కినేని ఫ్యామిలీ నుంచి పరిచయం అయిన యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. నాగార్జున కొడుకుగా వచ్చిన అతడు.. తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగిపోయాడు. ఫలితంగా స్టార్‌డమ్‌ను అందుకోవడంతో పాటు మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న నాగ చైతన్య.. గత వారమే 'థ్యాంక్యూ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' 7 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

    థ్యాంక్యూ అంటూ వచ్చిన చైతూ

    థ్యాంక్యూ అంటూ వచ్చిన చైతూ

    అక్కినేని నాగ చైతన్య - విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందించాడు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.

    స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!

    థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్

    థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్


    నాగ చైతన్య మార్కెట్‌ ప్రకారమే 'థ్యాంక్యూ' మూవీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.

    7వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది?

    7వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది?

    వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న నాగ చైతన్య నటించిన తాజా చిత్రమే 'థ్యాంక్యూ'. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో ఆరంభంలోనే ప్రేక్షకుల స్పందన అంతగా రాలేదు. అదే ప్రతి రోజూ కంటిన్యూ అవుతూ కలెక్షన్లు ఘోరంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే 7వ రోజు మరింత పడిపోయి కేవలం రూ. 5 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి.

    Ramarao On Duty Twitter Review: రవితేజ మూవీ పరిస్థితి ఇదా.. కొత్త సమస్య.. ఓవరాల్ రిపోర్ట్ ఏంటంటే!

    వారం రోజులకు కలిపి ఎంతంటే

    వారం రోజులకు కలిపి ఎంతంటే

    'థ్యాంక్యూ' మూవీకి ఏపీ, తెలంగాణలో వారం రోజుల్లో చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 63 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రూ. 3.25 కోట్లు షేర్, రూ. 5.60 కోట్లు గ్రాస్ దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 3.25 కోట్లు షేర్ రాబట్టిన 'థ్యాంక్యూ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 87 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాగ చైతన్య సినిమాకు రూ. 4.29 షేర్‌తో పాటు రూ. 7.65 కోట్లు గ్రాస్‌ మాత్రమే వచ్చింది.

    టాప్ విప్పేసి రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా ఘోరంగా ఫోజులు

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'థ్యాంక్యూ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 4.29 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో 20.71 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    English summary
    Akkineni Naga Chaitanya DId Thank You Movie under Vikram K. Kumar Direction. This Movie Collects Rs 4.30 Crores in 1st Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X