twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

Thank You 2 Days Collections: సగానికి సగం డౌన్.. రెండో రోజే ఘోరంగా.. ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్ల వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే సత్తా చాటుతూ సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో అక్కినేని కుర్రాడు యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. ఈ మధ్య కాలంలో 'మజిలీ' మూవీ నుంచి మొదలుకొని 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి వరుస హిట్లతో సూపర్ డూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'థ్యాంక్యూ' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాలతో తాజాగా విడుదలైన ఈ మూవీకి ఊహించని స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' మూవీ 2 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

థ్యాంక్యూ అంటూ వచ్చిన చైతూ

థ్యాంక్యూ అంటూ వచ్చిన చైతూ

అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన సినిమానే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందించాడు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు.

స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన ప్రియాంక: అబ్బో తడిచిన అందాలను చూపిస్తూ!
స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన ప్రియాంక: అబ్బో తడిచిన అందాలను చూపిస్తూ!

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్

నాగ చైతన్య మార్కెట్‌ను బట్టి 'థ్యాంక్యూ' మూవీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

2వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది

2వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది

'థ్యాంక్యూ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2వ రోజు వసూళ్లు సగానికి సగం పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 26 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 70 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

పొట్టి డ్రెస్‌తో షాకిచ్చిన భూమిక: వామ్మో అలా పడుకుని అందాల విందు
పొట్టి డ్రెస్‌తో షాకిచ్చిన భూమిక: వామ్మో అలా పడుకుని అందాల విందు

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది

ఏపీ, తెలంగాణలో 'థ్యాంక్యూ' మూవీకి 2 రోజుల్లో తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 98 లక్షలు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 35 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 17 లక్షలు, నెల్లూరులో రూ. 10 లక్షలతో.. రూ. 2.35 కోట్లు షేర్, రూ. 3.90 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 రోజుల్లో రూ. 2.35 కోట్లు షేర్ రాబట్టిన 'థ్యాంక్యూ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా అంతగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 10లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 65 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాగ చైతన్య సినిమాకు రూ. 3.10 షేర్‌తో పాటు రూ. 5.35 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది.

తల్లైన తర్వాత మరో యాక్టర్‌తో హీరోయిన్ ఎఫైర్: బెడ్‌పై రొమాన్స్ చేసే పిక్ వైరల్
తల్లైన తర్వాత మరో యాక్టర్‌తో హీరోయిన్ ఎఫైర్: బెడ్‌పై రొమాన్స్ చేసే పిక్ వైరల్

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

నాగ చైతన్య హీరోగా నటించిన 'థ్యాంక్యూ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 3.10 కోట్లు వచ్చాయి. అంటే మరో 21.90 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

English summary
Akkineni Naga Chaitanya DId Thank You Movie under Vikram K. Kumar Direction. This Movie Collects Rs 3.10 Crores in 2 Days.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X