Thank You 3 Days Collections: సండే షాకింగ్ కలెక్షన్లు.. 3 రోజుల్లో దారుణం.. అదే జరిగితే నష్టాలే

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి నటనతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఈ ఉత్సాహంతోనే ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో చైతూ వరుసగా 'మజిలీ', 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి వరుస హిట్లతో సత్తా చాటుతున్నాడు.

ఇక, ఇప్పుడు ఈ అక్కినేని హీరో 'థ్యాంక్యూ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి చాలా తక్కువగా స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' మూవీ 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

థ్యాంక్యూ చెప్పేందుకు వచ్చాడు

థ్యాంక్యూ చెప్పేందుకు వచ్చాడు

అక్కినేని నాగ చైతన్య - విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమానే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందించాడు. ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు.

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్

నాగ చైతన్య మార్కెట్‌ ప్రకారమే 'థ్యాంక్యూ' మూవీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ టాక్.

3వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది

3వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది


3వ రోజు 'థ్యాంక్యూ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు మరింతగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 17 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 40 లక్షలు షేర్, రూ. 70 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది

3 రోజులకు కలిపి ఎంతొచ్చింది


'థ్యాంక్యూ' మూవీకి ఏపీ, తెలంగాణలో 3 రోజుల్లో వసూళ్లు దారుణంగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 32 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 42 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో.. రూ. 2.75 కోట్లు షేర్, రూ. 4.60 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజుల్లో రూ. 2.75 కోట్లు షేర్ రాబట్టిన 'థ్యాంక్యూ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా అంతగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 11 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 74 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాగ చైతన్య సినిమాకు రూ. 3.60 షేర్‌తో పాటు రూ. 6.25 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'థ్యాంక్యూ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 3.60 కోట్లు వచ్చాయి. అంటే మరో 21.40 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X