Don't Miss!
- Sports
INDvsAUS : వాళ్లకు కూడా గాయాలైతే సిరీస్ ముగిసినట్లే.. ఆసీస్ టెస్టులపై పేలుతున్న మీమ్స్!
- News
సెల్ఫీ వీడియో తీసుకుని బీజేపీనేత ఆత్మహత్య.. ఎన్నికల ఓటమి, వారి వేధింపులే కారణం!!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Thank You 4 Days Collections: చైతన్యకు కోలుకోలేని షాక్.. 4 రోజుల్లో ఇంత తక్కువ వసూళ్లా!
ఆ మధ్య వరుస పరాజయాలతో తెగ ఇబ్బందులు పడినా.. కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు అక్కినేని నట వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య. శివ నిర్వాణ తెరకెక్కించిన 'మజిలీ' నుంచి మొదలుకొని వరుసగా 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి వరుస విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'థ్యాంక్యూ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. క్రేజీ కాంబినేషన్‌లో ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' మూవీ 4 రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? చూద్దాం పదండి!

థ్యాంక్యూ అంటూ వచ్చిన చైతూ
అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన సినిమానే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి కథ, మాటలు అందించాడు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు.
ఆ భాగాలను చూపిస్తూ పాయల్ వీడియో: అమె వేసుకున్న డ్రెస్ చూశారంటే!

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్
నాగ చైతన్య మార్కెట్ అనుగుణంగా 'థ్యాంక్యూ' మూవీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

4వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది
నాగ చైతన్య - రాశీ ఖన్నా జంటగా నటించిన 'థ్యాంక్యూ' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు చాలా తక్కువగానే ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా దీనికి వసూళ్లు రోజు రోజుకూ భారీగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 4వ రోజైన సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 21 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.
టాప్ బటన్స్ విప్పేసిన అషు రెడ్డి: అబ్బో ఇలా చూపిస్తుందేంటి!

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది
ఏపీ, తెలంగాణలో 'థ్యాంక్యూ' మూవీకి 4 రోజుల్లో వసూళ్లు తక్కుగాగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 57 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 19 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో.. రూ. 2.96 కోట్లు షేర్, రూ. 5.00 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 2.96 కోట్లు షేర్ రాబట్టిన 'థ్యాంక్యూ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా అంతగా రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 13 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 78 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాగ చైతన్య సినిమాకు రూ. 3.87 షేర్‌తో పాటు రూ. 6.80 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.
శృతి మించిన రష్మిక అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ
కాంబోలో
రూపొందిన
'థ్యాంక్యూ'
మూవీకి
అంచనాలకు
అనుగుణంగానే
ప్రపంచ
వ్యాప్తంగా
రూ.
24.00
కోట్లు
మేర
బిజినెస్
జరిగినట్లు
ట్రేడ్
వర్గాలు
వెల్లడించాయి.
దీంతో
బ్రేక్
ఈవెన్
టార్గెట్
రూ.
25
కోట్లుగా
నమోదైంది.
ఇక,
4
రోజుల్లో
దీనికి
రూ.
3.87
కోట్లు
మాత్రమే
వచ్చాయి.
అంటే
మరో
21.13
కోట్లు
వసూలు
చేస్తేనే
ఈ
సినిమా
హిట్
స్టేటస్‌ను
సొంతం
చేసుకుంటుంది.