Thank You 5 Days Collections: 5వ రోజు మరింత ఘోరం.. థ్యాంక్యూ కలెక్షన్లు చూస్తే షాక్ అవుతారు!
అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని.. స్టార్‌గా ఎదిగిపోయాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఈ క్రమంలోనే 'మజిలీ' నుంచి వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. ఈ ఉత్సాహంతోనే నాగ చైతన్య ఇటీవలే 'థ్యాంక్యూ' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి దారుణమైన రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' మూవీ 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

థ్యాంక్యూ అంటూ చైతూ ఎంటర్
యువ సామ్రాట్ నాగ చైతన్య - విక్రమ్ కే కుమార్ కాంబోలో వచ్చిన సినిమానే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి కథ, మాటలు అందించాడు. ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చాడు.

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్
నాగ చైతన్య మార్కెట్ ప్రకారమే 'థ్యాంక్యూ' మూవీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ టాక్.

5వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది
నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన 'థ్యాంక్యూ' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అంతగా రాలేదు. ఆ తర్వాత కూడా దీనికి వసూళ్లు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 5వ రోజైన మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 15 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

5 రోజులకు కలిపి ఎంతొచ్చింది
5 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'థ్యాంక్యూ' మూవీకి షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 36 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 60 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రూ. 3.11 కోట్లు షేర్, రూ. 5.30 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5 రోజుల్లో రూ. 3.11 కోట్లు షేర్ రాబట్టిన 'థ్యాంక్యూ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా భారీ దెబ్బను ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 15 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 82 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాగ చైతన్య సినిమాకు రూ. 4.08 షేర్‌తో పాటు రూ. 7.22 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'థ్యాంక్యూ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 4.08 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో 20.92 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











