Thank You 6 Days Collections: 9 లక్షలు ఏంటి సామీ.. చైతూ కెరీర్‌లోనే తొలిసారి ఇలా!
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కిడ్స్ హీరోలుగా సందడి చేస్తున్నారు. అందులో అక్కినేని ఫ్యామిలీ నుంచి పరిచయం అయిన యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. నాగార్జున కొడుకుగా వచ్చిన అతడు.. తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగిపోయాడు. ఫలితంగా స్టార్‌డమ్‌ను అందుకోవడంతో పాటు మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న నాగ చైతన్య.. గత వారమే 'థ్యాంక్యూ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' 6 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

థ్యాంక్యూ చెప్పేందుకు వచ్చాడు
అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ మూవీనే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి కథ, మాటలు అందించాడు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు.

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్
నాగ చైతన్య మార్కెట్ అనుగుణంగానే 'థ్యాంక్యూ' మూవీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

6వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది
'మనం' వంటి హిట్ తర్వాత నాగ చైతన్య - విక్రమ్ కే కుమార్ కాంబోలో రూపొందిన సినిమానే 'థ్యాంక్యూ'. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో ఆరంభంలోనే ప్రేక్షకుల స్పందన అంతగా రాలేదు. అదే కంటిన్యూ అవుతూ రావడంతో దీనికి కలెక్షన్లు చాలా తక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే 6వ రోజు కేవలం రూ. 9 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

6 రోజులకు కలిపి ఎంతొచ్చింది
ఏపీ, తెలంగాణలో 'థ్యాంక్యూ' మూవీకి 6 రోజుల్లో చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.19 కోట్లు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 62 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 21 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రూ. 3.20 కోట్లు షేర్, రూ. 5.48 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
6 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 3.20 కోట్లు షేర్ రాబట్టిన 'థ్యాంక్యూ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 16 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 85 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాగ చైతన్య సినిమాకు రూ. 4.21 షేర్‌తో పాటు రూ. 7.45 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన 'థ్యాంక్యూ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 4.21 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మరో 20.79 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











