Thank You 8 Days Collections: రెండో వారమే ఔట్.. చైతూకు ఊహించని దెబ్బ.. ఏకంగా అన్ని కోట్ల లాస్!
అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అతడు.. స్టార్‌డమ్‌తో పాటు మార్కెట్‌ను కూడా సంపాదించుకున్నాడు. అయితే, మధ్యలో చాలా కాలం పాటు ఫ్లాపులతో సతమతం అయ్యాడు.
ఇక, ఇటీవలి కాలంలో ఫుల్ ఫామ్‌తో ఉన్న చైతూ.. ఇటీవలే 'థ్యాంక్యూ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' 8 రోజుల్లో ఎంత వసూలు చేసింది? టార్గెట్‌కు ఎంత దూరంలో ఉంది? అనేవి మీరే చూడండి!

థ్యాంక్యూ అంటూ చైతూ ఎంటర్
యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన మూవీనే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి కథ, మాటలు అందించాడు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు.

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్
నాగ చైతన్య రేంజ్‌కు అనుగుణంగానే 'థ్యాంక్యూ' మూవీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

8వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది?
ఈ మధ్య కాలంలో వరుసగా విజయాలను అందుకుంటోన్న నాగ చైతన్య ఇటీవలే 'థ్యాంక్యూ' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఆంధ్రా, తెలంగాణలో రెస్పాన్స్ సరిగా రావట్లేదు. రెండో వారంలోకి ఎంటర్ అవగానే దీనికి మరింత దెబ్బ తగిలింది. ఫలితంగా 8వ రోజు ఈ చిత్రానికి రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 5 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి.

8 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
ఏపీ, తెలంగాణలో 'థ్యాంక్యూ' మూవీకి 8 రోజుల్లో చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.23 కోట్లు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 64 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో.. రూ. 3.30 కోట్లు షేర్, రూ. 5.70 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
8 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 3.30 కోట్లు షేర్ రాబట్టిన 'థ్యాంక్యూ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 18 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 88 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాగ చైతన్య సినిమాకు రూ. 4.36 షేర్‌తో పాటు రూ. 7.80 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన 'థ్యాంక్యూ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 4.36 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సినిమా విజయం సాధించేందుకు మరో రూ 20.64 కోట్లు దూరంలోనే ఉండిపోయింది.


Click it and Unblock the Notifications











