Thank You 9 Days Collections: శనివారం షాకింగ్ కలెక్షన్లు.. వచ్చింది కాసింత.. రావాల్సింది కొండంత

ఆ మధ్య చాలా ఫ్లాపులతో తెగ ఇబ్బందులు పడినా... శివ నిర్వాణ తెరకెక్కించిన 'మజిలీ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య. దీని తర్వాత 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత వారమే చైతూ 'థ్యాంక్యూ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫీల్ గుడ్ స్టోరీతో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ నిరాశే ఎదురవుతోంది. ఫలితంగా కలెక్షన్లు పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

 థ్యాంక్యూ అంటూ చైతూ సందడి

థ్యాంక్యూ అంటూ చైతూ సందడి

అక్కినేని నాగ చైతన్య - విక్రమ్ కే కుమార్ కలయికలో రూపొందిన మూవీనే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందించాడు. ఎస్ థమన్ దీనికి మ్యూజిక్ అందించాడు.

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్

థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్


నాగ చైతన్య మార్కెట్ ప్రకారమే 'థ్యాంక్యూ' మూవీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 9 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 9.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమచారం.

9వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది?

9వ రోజు ఎక్కడ.. ఎంతొచ్చింది?


నాగ చైతన్య హీరోగా.. రాశీ ఖన్నా, మాళవిక, అవికా గోర్ కీలక పాత్రలను పోషించిన 'థ్యాంక్యూ' మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో 9వ రోజు ఈ చిత్రానికి రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 7 లక్షలు మాత్రమే వచ్చాయి.

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది?

9 రోజులకు కలిపి ఎంతొచ్చింది?


9 రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'థ్యాంక్యూ' మూవీకి చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.26 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 29 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో.. రూ. 3.37 కోట్లు షేర్, రూ. 5.85 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9 రోజుల్లో రూ. 3.37 కోట్లు షేర్ రాబట్టిన 'థ్యాంక్యూ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.01 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపి 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా నాగ చైతన్య సినిమాకు రూ. 4.46 షేర్‌తో పాటు రూ. 7.95 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'థ్యాంక్యూ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 4.46 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సినిమా విజయం సాధించేందుకు మరో రూ 20.54 కోట్లు దూరంలోనే ఉండిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X