twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Thank You Closing Collections: 25 కోట్ల బిజినెస్.. అన్ని కోట్ల నష్టాలు.. తొలి మూవీగా చెత్త రికార్డు

    |

    అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్‌తో స్టార్‌గా ఎదిగిపోయాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. హీరోగా పరిచయమైన కొత్తలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను సైతం పెంచుకున్నాడు. దీనికితోడు ఇటీవల వరుసగా హిట్లను సొంతం చేసుకుంటూ దూసుకుతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇటీవలే నాగ చైతన్య 'థ్యాంక్యూ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఏ ఏరియాలోనూ ఆదరణ లభించలేదు. దీంతో కలెక్షన్లు క్రమంగా పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'థ్యాంక్యూ' మూవీ ఫుల్ రన్‌లో ఎంత రాబట్టింది? ఎంత మేర నష్టపోయింది? అనేవి చూద్దాం పదండి!

    థ్యాంక్యూ అంటూ వచ్చేసిన చైతూ

    థ్యాంక్యూ అంటూ వచ్చేసిన చైతూ

    అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన మూవీనే 'థ్యాంక్యూ'. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఎస్ థమన్ దీనికి సంగీతం అందించాడు. ఈ మూవీకి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందించాడు.

    విచిత్రమైన డ్రెస్‌లో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో మరీ ఇంత దారుణమా!విచిత్రమైన డ్రెస్‌లో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో మరీ ఇంత దారుణమా!

    థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్

    థ్యాంక్యూ మూవీ టోటల్ బిజినెస్

    నాగ చైతన్య మార్కెట్‌‌కు అనుగుణంగానే 'థ్యాంక్యూ' మూవీ బిజినెస్ జరిగింది. దీనికి నైజాంలో రూ. 8 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 24.00 కోట్ల బిజినెస్ జరిగింది.

    అలాంటి రెస్పాన్స్.. కలెక్షన్లు ఇలా

    అలాంటి రెస్పాన్స్.. కలెక్షన్లు ఇలా


    టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరొందిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటించిన చిత్రమే 'థ్యాంక్యూ'. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ, దీనికి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రాలేదు. ప్రపంచ వ్యాప్తంగానూ ఈ సినిమా ప్రభావాన్ని చూపలేకపోయిందనే చెప్పుకోవాలి.

    మేకప్ రూంలో తెలుగు హీరోయిన్ హాట్ ట్రీట్: ఆ పార్ట్‌లను హైలైట్ చేస్తూ!మేకప్ రూంలో తెలుగు హీరోయిన్ హాట్ ట్రీట్: ఆ పార్ట్‌లను హైలైట్ చేస్తూ!

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

    తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది?

    ఏపీ, తెలంగాణలో 'థ్యాంక్యూ' మూవీకి ఫుల్ రన్‌లో చాలా తక్కువ కలెక్షన్లు దక్కాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 38 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 66 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రూ. 3.35 కోట్లు షేర్, రూ. 5.80 కోట్లు గ్రాస్ దక్కింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


    ఫుల్ రన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 3.35 కోట్లు షేర్ రాబట్టిన 'థ్యాంక్యూ' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ రాణించలేదు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 90 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపి ప్రపంచ వ్యాప్తంగా నాగ చైతన్య సినిమాకు రూ. 4.45 షేర్‌తో పాటు రూ. 8.00 కోట్లు గ్రాస్‌ మాత్రమే వసూలు అయింది.

    దీప్తి సునైనాకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ముద్దులు: నీ ప్రవర్తన ఏంటి అంటూ వీడియో వదిలి మరీ!దీప్తి సునైనాకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ముద్దులు: నీ ప్రవర్తన ఏంటి అంటూ వీడియో వదిలి మరీ!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'థ్యాంక్యూ' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా నమోదైంది. ఇక, ముగింపు సమయానికి దీనికి రూ. 4.54 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఈ సినిమాకు ఏకంగా రూ. 20.55 కోట్లు నష్టాలు వచ్చాయి.

    చైతూ కెరీర్‌లోనే చెత్త రికార్డు ఇదే

    చైతూ కెరీర్‌లోనే చెత్త రికార్డు ఇదే


    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'థ్యాంక్యూ' మూవీకి మొదటి నుంచే ఆదరణ పెద్దగా లభించలేదు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ దీనికి దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఫలితంగా ఈ సినిమాకు రూ. 20.55 కోట్లు నష్టాలు ఎదురయ్యాయి. ఫలితంగా నాగ చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఈ సినిమా చెత్త రికార్డును నమోదు చేసింది.

    English summary
    Akkineni Naga Chaitanya DId Thank You Movie under Vikram K. Kumar Direction. This Movie Collects Rs 4.45 Crores in Full Run.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X