Thank You Movie Business: సక్సెస్ ట్రాక్ లో నాగచైతన్య రికార్డులు.. ఈసారి టార్గెట్ ఎంతంటే?
నాగచైతన్య రాశి ఖన్నా జంటగా నటించిన థాంక్ యూ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలుస్తుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అయితే మంచి అంచనాలు ఉన్నాయి. తప్పకుండా నాగచైతన్య మరోసారి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక థాంక్ యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అలాగే సినిమా సక్సెస్ అవ్వాలి అంటే మొత్తం ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టాలి బ్రేక్ ఈవెన్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

మనం తరువాత
నాగచైతన్య గత కొంతకాలంగా ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకు అంటున్నాడు. ఒక విధంగా ప్రేక్షకుల్లో అతని మంచి నమ్మకం ఎంత ఏర్పడింది భిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇక మనం సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన థాంక్ యూ సినిమా పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి

థియేటర్స్ సంఖ్య
థాంక్ యూ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీగానే విడుదల చేస్తున్నారు. నైజాం లో 203 థియేటర్లో విడుదల చేస్తున్న దిల్ రాజు సీడెడ్ లో 110, ఆంధ్రాలో మొత్తంగా 310 థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. ఇక ఏపీ తెలంగాణలో కలుపుకొని 650 థియేటర్లలో విడుదల కానుంది. కర్ణాటక అలాగే మిగతా రాష్ట్రాల్లో 100కు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో అయితే 300 ధియేటర్స్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాగచైతన్య సినిమా 1050 ధియేటర్లలో విడుదలవుతోంది.

నాగచైతన్య ఫస్ట్ డే ట్రాక్
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద నాగచైతన్య మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది.
అయితే అతని గత సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే.. లవ్ స్టోరీ సినిమా మొదటి రోజు 7. 13 కోట్లు రాబట్టింది. ఇక మజిలీ సినిమా 5.6 కోట్లు అందుకోగా అంతకుముందు వచ్చిన సవ్యసాచి 3.29 కోట్లు అందుకుంది.. ఇక మారుతీ దర్శకత్వంలో వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు 6.93 కోట్లు సాధించింది. ఇక థాంక్యూ సినిమా ఫస్ట్ డే ఐదు కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉన్నట్లు అనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్
థాంక్ యూ సినిమా మొత్తం ఏ స్థాయిలో బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో 8 కోట్ల ధర పలికిన ఈ సినిమా సీడెడ్ లో 2.50 కోట్లు, ఆంధ్రాలో మొత్తంగా 9.5 కోట్లు బిజినెస్ చేసిన ఈ సినిమా ఏపీ తెలంగాణలో టోటల్ గా 20 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్
ఇక మిగతా రాష్ట్రాల్లో థాంక్ యూ సినిమా సాధారణంగానే బిజినెస్ చేసినట్లు అనిపిస్తోంది. కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియాలో కలుపుకుని మొత్తంగా 1.5 కోట్లు ధర పలికిన థాంక్ యూ సినిమా ఓవర్సీస్ లో 2.50 కోట్ల వరకు అమ్ముడైనట్లు సమాచారం. ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా అయితే థాంక్ యూ సినిమా 24 కోట్ల బిజినెస్ చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్
థాంక్ యూ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 24 కోట్ల బిజినెస్ చేయగా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ అయింది. సినిమా తప్పకుండా వీకెండ్ లోనే మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక టార్గెట్ ను ఎన్ని రోజుల్లో సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. నాగచైతన్య గత నాలుగు సినిమాలు కూడా బ్రేక్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేశాయి. మరి ఈ సినిమా ఎంతవరకు ఒక క్లిక్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











